కొన్ని సినిమాలని ఎన్ని సార్లు చూసినా కూడా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.ఇలా కొన్ని సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది.
ఇలాంటి కొన్ని సినిమాలు సాధారణ ప్రేక్షకులకు మాత్రమే కాదు సెలబ్రిటీలను కూడా పెద్ద ఎత్తున ఆకట్టుకుంటూ ఉంటాయి.ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు( Mahesh Babu ) సైతం ఇలా ఓ సినిమాని ఎంతగానో ఇష్టపడతారని తెలుస్తుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయనకు ఎన్టీఆర్ ( NTR ) నటించిన ఓ సినిమా అంటే చాలా ఇష్టమట.

మహేష్ బాబుకు ఏమాత్రం సమయం దొరికిన ఎన్టీఆర్ నటించిన ఆ సినిమాని చూస్తూ ఉంటారట ఇప్పటికే ఓ 100 సార్లైనా ఆ సినిమాని చూశారని తెలుస్తుంది.మరి 100 సార్లు మహేష్ బాబు చూసిన ఎన్టీఆర్ సినిమా ఏది అనే విషయానికొస్తే ఆ సినిమా మరీదో కాదు రాఖి( Rakhi Movie ).ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఈ సినిమాకు మాత్రం కొంతమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాని ఎంతగానో ఇష్టపడుతుంటారు.

ఒక ఎన్టీఆర్ నటనకు మాత్రం మహేష్ బాబు ఫిదా అయ్యారని ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం అంటే మహేష్ బాబుకి చాలా ఇష్టం అని తెలుస్తుంది.అందుకే ఈ సినిమాని ఇప్పటివరకు ఓ 100 సార్లు అంటే చూసి ఉంటారట.ఇలా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక మహేష్ బాబు విషయానికొస్తే ప్రస్తుతం ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.