తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం తను చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది.

ప్రస్తుతానికి సెట్స్ మీద ఉంచిన సినిమాలను ఫినిష్ చేసిన తర్వాత ఆయన మిగతా సినిమాలకు కమిట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.ఇక ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’( Hari Hara Veeramallu ) సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి.మొత్తానికైతే ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇప్పటికే పలు రిలీజ్ డేట్స్ వాయిదా వేసిన సందర్భంలో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుంది అనే దానిమీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరో ఈ సినిమాకి డేట్స్ ఇవ్వకపోవడం వల్ల అటు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ విపరీతంగా ఇబ్బందులకు గురవుతున్నారనే చెప్పాలి.మరి ఇప్పటికైనా ఆయన భారీ సినిమాలను చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు…మరి ఇలాంటి క్రమం లో ఆయన ఫ్యూచర్ లో సీఎం గా కూడా ఎదిగే అవకాశాలైతే ఉన్నాయి…
.