ఇటీవల విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై (female police constable)ఓ దుండగుడు అత్యంత నీచంగా ప్రవర్తించాడు.ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.ఈ దారుణాన్ని ఎవరో వీడియో తీయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.“digitalsangghi” అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు.అందులో బ్లూ కలర్ చొక్కా వేసుకున్న వ్యక్తి మహిళా కానిస్టేబుల్‌ను అసభ్యంగా తాకుతూ, ఆమెను నెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది.ఆ మహిళా పోలీస్ తన పని తాను చేసుకుంటున్నా, ఆ వ్యక్తి మాత్రం ఆమెకు అడ్డుతగిలి బహిరంగంగా దురుసుగా ప్రవర్తించాడు.ఈ వీడియోకు ఇప్పటికే 1,600 పైగా వ్యూస్ వచ్చాయి.
“బ్లూ షర్టు వేసుకున్న ఈ వ్యక్తి మహిళా కానిస్టేబుల్‌తో ఏం చేస్తున్నాడు? మన దేశంలో ఇలాంటి నీచులు లెక్కలేనంత మంది ఉన్నారు.అందుకే మనకు ‘రేప్ క్యాపిటల్’ అనే చెడ్డ పేరు వచ్చింది.అయినా ఎవరికీ సిగ్గులేనట్లు ఉంది.” అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ పెట్టారు.ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది.“సిగ్గులేని నీచుడు” అంటూ ఒక నెటిజన్ మండిపడ్డారు.“ఛీ, సిగ్గుండాలి” అని మరొకరు కామెంట్ చేశారు.“వాడికి ఏం కాదులే.మన చట్టాలు కోర్టుల్లో భర్తలను మాత్రమే కట్టడి చేయడానికి ఉన్నాయి” అని ఇంకొకరు అసహనం వ్యక్తం చేశారు.
చాలా మంది యూజర్లు ఆ దుండగుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.“వీడికి బాగా దేహశుద్ధి చేయాలి” అని ఒకరు కామెంట్ చేస్తే, “అప్పుడే గట్టిగా తన్నాల్సింది” అని మరొకరు సూచించారు.ఈ ఘటనతో మహిళా పోలీసులు విధి నిర్వహణలో కూడా సురక్షితంగా లేరా అనే ప్రశ్న తలెత్తుతోంది.కొందరు వ్యక్తులు చట్టాన్ని గౌరవించకపోవడం, మహిళా పోలీసుల పట్ల మరింత అసభ్యంగా ప్రవర్తించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.