ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రజలకు శరీరక శ్రమ తక్కువగా ఉంది.అందువల్ల చాలామంది ప్రజలు యోగ ఆసనాలతో శరీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
యోగాసనాలు వేయడం వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యం కూడా బాగా ఉంటుందని యోగా నిపుణులు చెబుతున్నారు.అంతేకాదు ఎముకల ఆరోగ్యాన్ని కూడా బలోపేతం చేసుకోవాలంటే కొన్ని రకాల యోగాసనాలను ప్రతిరోజు వేయడం ఎంతో మంచిది.
ప్రతిరోజు యోగా చేయడం వల్ల చర్మ ఆరోగ్యంతో పాటు బరువు తగ్గే అవకాశం కూడా ఉంది.యోగ ఎముకలను కూడా బలోపేతం చేస్తుంది.
ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఎలాంటి ఆసనాలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఎడమ కాలు వెనుకకు వంచి దాని కుడి వెళ్లను బయటకు చూపిస్తూ నిలబడాలి.
మీ కుడి చేతిని ముందుకి ఎడమచేతిని వెనుక చాచాలి.అవి సమాంతరంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి.
ఇప్పుడు మీ కుడి మోకాలిని నేరుగా మీ చీల మండలం పైకి వచ్చేవరకు వంచాలి.మీ శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి.
మీ వెన్న ముక్కను స్ట్రచ్ చేస్తూ ఉండాలి.మీ చాతిని విస్తరించడం మంచిది.
మీ కుడిచేతి వేల్లపై మీ దృష్టి పెట్టాలి.ఈ భంగిమను ఒక నిమిషం పాటు ఉంచి ఆ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకొని మళ్లీ చేయడం మంచిది.
ఈ యోగాసనాన్ని వీరభద్రాసనం అని అంటారు.
ఇంకా చెప్పాలంటే మీ పాదాలను వెడల్పుగా ఉంచి నిలబడి, మీ ఎడమ కాళీ వెళ్ళను 45 డిగ్రీల కోణంలో లోపలికి ఎదురుగా ఉంచి, మీ కుడి కాలి వెళ్ళను బయటకు తిప్పాలి.మీ వీపును కుడి వైపుకు వంచి కుడి చేతిని నేలపైకి తీసుకురావాలి.కుడి చేతికి సమాంతరంగా ఎడమ చేతిని పై కప్పు వైపునకు పెట్టాలి.
పై కప్పు వైపు చూస్తూ ఒక నిమిషం పాటు అలాగే ఉండాలి.దీన్ని కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ చేస్తే మంచిది.
ఈ యోగాసనాన్ని త్రికోణాసనం అని అంటారు.ఈ యోగాసనాలు ఎంతో జాగ్రత్తగా చేయాలి.
ఆరోగ్యం సరిగ్గా లేని వారు,వీటిపై అవగాహన లేనివారు వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.