విజయ్ దేవరకొండ, సమంత ( Vijay Devarakonda, Samantha )జంటగా నటించిన చిత్రం “ఖుషి”( Khushi ).శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.
భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు మేకర్స్.ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇండస్ట్రీ లో అందరి కళ్ళు ఈ చిత్రం మీదే.
కారణం ఈ సినిమాకు పనిచేసిన దర్శకుడుకి, నటించిన హీరో, హీరోయిన్ కి ఈ చిత్రం విజయం సాధించడం చాలా అవసరం.

అర్జున్ రెడ్డి ( Arjun Reddy )చిత్రంతో భారత దేశ సినీ పరిశ్రమలో ఒక సునామి సృష్టించిన విజయ్ దేవరకొండ, గీత గోవిందం చిత్రం తో స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు.కానీ ఆ తరువాత విజయ్ కి చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒక్కటి కూడా లేదు.గీత గోవిందం 2018 లో విడుదలయింది.
ఆ తరువాత విజయ్ నటించిన డియర్ కామ్రాడ్ (2019), వరల్డ్ ఫేమస్ లవర్ (2020), లైగర్(2022) చిత్రాలు డిజాస్టర్లు గా మిగిలాయి.అంటే విజయ్ కి హిట్ వచ్చి సుమారు 5 సంవత్సరాలు అవుతుంది.
ఇప్పుడు ఖుషి కూడా ప్లాప్ అయి ఉంటె విజయ్ కెరీర్ ఇబ్బందుల్లో పాడేది.

ఇక సమంత విషయానికొస్తే ఆమెది కూడా ఇదే పారిస్తాయి.చాలా కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ 1 హీరోయినిగా వెలుగుతున్న సమంతకు కూడా చాలా కాలంగా హిట్ సినిమా లేదు.జాను (2020), యశోద (2022), శాకుంతలం (2023) చిత్రాలు ఆశించిన విజయాలను సాధించలేదు.
వరుస మూడు ప్లాప్ లతో సతమతమవుతున్న సమంతకు కూడా ఖుషి విజయం చాలా ప్రధానం.శ్రీ లీల, కృతి శెట్టి వంటి యంగ్ హీరోయిన్లు ఎక్కువవుతున్న ఈ సమయంలో సమంత తిరిగి ఫామ్ లోకి రాకపోతే ఆమెకు అవకాశాలు తగ్గడం ఖాయం.
దర్శకుడు శివ నిర్వాణ టక్ జగదీష్ వంటి డిసాస్టర్ తరువాత దర్శకత్వం వహించిన చిత్రం ఇది.ఈ చిత్రం విఫలం అయ్యి ఉంటె శివ కెరీర్ కూడా దెబ్బతినేది.