టాలీవుడ్ హీరో రామ్ చరణ్( Hero Ram Charan ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు రామ్ చరణ్.
అందులో భాగంగానే ఇటీవల గేమ్ చేంజర్ సినిమాతో ( Game Changer )ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
ఈ సినిమా తర్వాత పెద్ది అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు రామ్ చరణ్.ఈ సినిమ బుచ్చిబాబు ( Buchi Babu )దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆ గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
అంతేకాకుండా ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి.రామ్ చరణ్ ఊర మాస్ లుక్ లో అదరగొట్టాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్( Commercial ads ) లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.అందులో భాగంగానే రామ్ చరణ్ కూడా ఇప్పటివరకు చాలా యాడ్స్ లో నటించారు.
ఇది ఇలా ఉంటే తాజాగా మరో యాడ్ లో నటించారు చెర్రీ.తాజాగా మరో కొత్త యాడ్ చేయడంతో పాటు ఆ కూల్ డ్రింక్ బ్రాండ్ కి అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అగ్ర సంస్థ రిలియన్స్ ఇండస్ట్రీ ఫుడ్ బెవర్జిస్ లో కూడా ఉన్న సంగతి తెలిసిందే.రిలయన్స్ కంపెనీ నుంచి కొన్నాళ్ల క్రితం కంపా( Comp ) అనే కూల్ డ్రింక్ వచ్చింది.ఆ కూల్ డ్రింక్ ఇప్పుడిప్పుడే మార్కెట్ లోకి వస్తుంది.తాజాగా ఆ కూల్ డ్రింక్ కి రామ చరణ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు రిలయన్స్ సంస్థ అధికారికంగా పోస్ట్ చేసింది.
ఈ మేరకు చరణ్ ఆ కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకున్న ఒక పోస్టర్ ని కూడా షేర్ చేసింది.అలాగే చరణ్ చేసిన యాడ్ కూడా పోస్ట్ చేసారు.
ఈ యాడ్ లో చరణ్ కి షూటింగ్ లో దెబ్బ తగలగా త్వరగా కోలుకోని మళ్ళీ అదే ఉత్సాహంతో వచ్చి షూటింగ్ చేసినట్టు చూపించారు.అయితే కొన్ని కూల్ డ్రింక్స్ ఒక్కో ఏరియాని బట్టి ఆ ఏరియా హీరోలని తీసుకొని యాడ్స్ చేస్తారు.
కానీ ఈ కూల్ డ్రింక్ రామ్ చరణ్ ని ఓవరాల్ పాన్ ఇండియా వైడ్ అంబాసిడర్ గా నియమించుకున్నట్టు తెలుస్తోంది.అందులోను ఈ యాడ్ హిందీలో చేసారు.
అంటే నార్త్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని చేసారు.దీంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.