హెయిర్ డ్యామేజ్ కు కారణాలేంటి.. ఈ సమస్యను ఎలా వదిలించుకోవాలి?

హెయిర్ డ్యామేజ్(Hair damage).ఎక్కువ శాతం మంది ఎదుర్కొనే సమస్యల్లో ఇది ఒకటి.

 What Causes Hair Damage? Hair Damage, Hair Care, Hair Care Tips, Healthy Hair, S-TeluguStop.com

హెయిర్ డ్రైయర్లు, కర్లింగ్ ఐరన్లు మరియు ఫ్లాట్ ఐరన్లను(Hair dryers, curling irons, flat irons) అధికంగా వినియోగించడం, పోషకాల కొరత, ఒత్తిడి, కాలుష్యం, రెగ్యులర్ గా తలస్నానం చేయడం, తడి జుట్టును దువ్వడం, కఠినమైన రసాయన చికిత్సలు, హార్మోన్లలో హెచ్చుతగ్గులు, కొన్ని రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల జుట్టు బలహీనంగా మారి ముక్క‌ల‌వ‌డం, చిట్ల‌డం జ‌రుగుతుంటుంది.ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీ తో సులభంగా హెయిర్ డ్యామేజ్ సమస్యను వదిలించుకోవచ్చు.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు మందారం పువ్వులను (Mandar flowers)వేసుకోవాలి.అలాగే రెండు తుంచిన మందారం ఆకులు(Mandar leaves), రెండు రెబ్బలు కరివేపాకు(Curry leaves), అరకప్పు చెట్టు నుంచి తీసిన ఫ్రెష్ అలోవెరా జెల్ (Fresh aloe vera gel)వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Damaged, Care, Care Tips, Damage, Pack, Healthy, Remedy-Telugu Health

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను కనుక వేసుకుంటే కొద్ది రోజుల్లోనే అదిరిపోయే రిజల్ట్ మీ సొంతమవుతుంది.ఈ ప్యాక్ బలహీనంగా మారిన జుట్టును సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తుంది.జుట్టును మూలం నుంచి బలోపేతం చేస్తుంది.

హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ వంటి సమస్యలకు వేగంగా చెక్ పెడుతుంది.అదే సమయంలో జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

అంతేకాదు వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చుండ్రు సమస్య దూరం అవుతుంది.జుట్టు ఆరోగ్యంగా కాంతివంతంగా మెరుస్తూ కనిపిస్తుంది.

డ్రై హెయిర్ సమస్యను కూడా ఈ ప్యాక్ తో ఈజీగా పరిష్కరించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube