1.కాజీపేట రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం
కాజీపేట రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం సృష్టించింది.ముంబై వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో బాంబు పెట్టామని 100 కి ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తం అయిన అధికారులు బాంబు స్కాడ్ తో తనిఖీలు నిర్వహించారు.
2.కేసిఆర్ అరెస్ట్ కావడం ఖాయం : కే ఏ పాల్
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అవనీతిమయం అని, త్వరలో ఆయన అరెస్ట్ ఖాయం అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
3.గవర్నర్ తో కాంగ్రెస్ బృందం భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం భేటీ అయింది.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబించడం పై గవర్నర్ కు కాంగ్రెస్ బృందం ఫిర్యాదు చేసింది.
4.రిజిస్ట్రేషన్ అదనంగా హరిత నిధి వసూలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో జరిగే భూమి రిజిస్ట్రేషన్లపై అదనంగా హరిత నిధిని వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు.
5.మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజా
ఏపీలో నూతన మంత్రి ఆర్.కె.రోజా బుధవారం సచివాలయంలోని తన చాంబర్ లో ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
6.రాయితీ చలానాలు చెల్లింపుకు మూడు రోజులే గడువు
రాయితీపై పెండింగ్ చలానా చెల్లించేందుకు గడువు ఏప్రిల్ 15 వరకే ఉందని హైదరాబాద్ సిటీ పోలీసులు తెలిపారు.
7.మైనారిటీ గురుకుల ప్రవేశాల గడువు పొడగింపు
టీఎస్ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించినట్లు ఓల్డ్ బోయినపల్లి టీఎస్ మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ప్రభాకర్రెడ్డి తెలిపారు.
8.చెట్లు నరకాలంటే అనుమతి తప్పనిసరి
చెట్లు నరకాలు అన్న స్థల మార్పిడి చేయాలన్న ప్రభుత్వ అనుమతి తప్పనిసరని హైదరాబాద్ పరిరక్షణ కమిటీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
9.నీటిపారుదల శాఖలో ఏఈ లకు పదోన్నతి
నీటిపారుదల శాఖలో 59 అసిస్టెంట్ ఇంజినర్లకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గా పదోన్నతి లభించింది.జోన్ 5 లో పనిచేస్తున్న 24 మందికి జోన్ 6 పరిధిలోని 29 మందికి ఈ పదోన్నతులు లభించాయి.
10.అధికారికంగా అంబేద్కర్ జయంతి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలను ఈనెల 14న అధికారికంగా నిర్వహించనున్నారు.
11.అక్బరుద్దీన్ కేసులో తీర్పు
మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గతంలో నిర్మల్ పట్టణంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కేసులో తీర్పు ఈరోజు వెలువడింది.ఈ కేసులో అక్బరుద్దీన్ నిర్దోషని కోర్టు తీర్పు చెప్పింది.
12.పోటీ పరీక్షలపై మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో మైనారిటీ అభ్యర్థులకు మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తామని ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ తెలిపారు.
13.19న సామూహిక నిరాహార దీక్షలు
అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వి ఆర్ ఎస్ ప్రతిపాదనలు, ఎస్ ఆర్ బి ఎస్ పథకం రద్దు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తూ, 19న రీజినల్ మేనేజర్ కార్యాలయాల వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది.
14.జిల్లాకో ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ సెల్
తెలంగాణలోని ప్రతి జిల్లాలో ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
15.ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కి ఏపీ హైకోర్టు షాక్
సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది.శ్రీలక్ష్మి రివ్యూ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.
16.గన్నవరం ఎయిర్ పోర్టులో ఆప్కో షోరూమ్
గన్నవరం ఎయిర్ పోర్టులో ఆప్కో నూతన షోరూమ్ ను మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు.
17.చిన్న వెంకన్న ఆలయంలో తప్పిన ప్రమాదం
ఏలూరు జిల్లా లోని ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో పెను ప్రమాదం తప్పింది.గ్యాస్ బండల లోడుతో వెళ్తున్న వ్యాన్ లో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో, అప్రమత్తమైన దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యి పోగలను అదుపు చేశారు.
18.జగన్ పై నారా లోకేష్ కామెంట్స్
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పీడ్ చూస్తుంటే గాలి పీల్చినా, వదిలినా జే ట్యాక్స్ వసూలు చేసేలా ఉన్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు.
19.ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఏపీలో నిధుల మళ్లింపు పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ లను పిడిఎఫ్ ఖాతాలకు మళ్ళించడం పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ ప్రారంభించింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,350 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 53,840
.