ట్రంప్ దెబ్బకి(Trump) అమెరికా అల్లాడిపోతుందా? నైక్, టెస్లా (Nike, Tesla)ఫ్యాక్టరీల్లో అమెరికన్లు బానిసల్లా పనిచేసే రోజులు వస్తాయా? ఈ సందేహాలు ఇప్పుడు అందరికీ భయం కలిగిస్తున్నాయి.సరిగ్గా ఇదే నేపథ్యంలో దీనికి సంబంధించి AI సృష్టించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికా-చైనా (America-China)మధ్య జరుగుతున్న పెద్ద గొడవలో ఇదొక కొత్త ట్విస్ట్.ఎవరో చైనా సోషల్ మీడియా యూజర్ క్రియేట్ చేసిన వీడియో ఇది.అమెరికా చైనా వస్తువులపై పన్నులు పెంచడంతో, అమెరికా భవిష్యత్తు ఎలా ఉంటుందో చూపిస్తూ చైనా వాళ్లు కౌంటర్ ఎటాక్ చేశారు.వీడియోలో అమెరికన్లే నైక్ టీ-షర్టులు, అమెరికా జెండా టోపీలు(Nike T-shirts, American flag hats) పెట్టుకుని నైక్ ఫ్యాక్టరీలో షూలు తయారు చేస్తూ కనిపించారు.
మధ్యలో చిప్స్ తింటూ, కూల్ డ్రింక్స్ తాగుతూ కష్టపడుతున్నారు.
ఇలాగే టెస్లా, యాపిల్ ఫ్యాక్టరీల్లో కూడా అమెరికన్లు రోబోల్లా పనిచేస్తూ కనిపించారు.చివర్లో అయితే మరీ కామెడీగా ఉంది.అమెరికా టాప్ బ్రాండ్ల బోర్డులన్నీ విరిగిపోయినట్టు చూపిస్తూ, వాటి మీద “మేక్ అమెరికా రిచ్ అగైన్” (Make America Rich Again”)అనే స్లోగన్ తగిలించారు.
అంటే అమెరికా మళ్లీ ధనవంతులుగా మారాలంటే ఇలా కష్టపడాల్సిందే అని చైనా వాళ్లు సెటైర్ వేశారన్నమాట.ట్రంప్(Trump) కొత్తగా చైనా వస్తువులపై పన్నులు పెంచాక ఈ వీడియో బయటకి రావడం విశేషం.
అమెరికా చైనా వస్తువులపై ఏకంగా 145% పన్ను వేసింది.దెబ్బకి చైనా కూడా ఊరుకుంటుందా? వెంటనే అమెరికా వస్తువులపై 125% పన్ను వేసి బుద్ధి చెప్పింది.ఇలా ఇద్దరూ పోటీపడి పన్నులు వేసుకోవడంతో ఈ రెండు దేశాల మధ్య గొడవలు మరింత ముదిరిపోయాయి.
ఈ వీడియో చూసిన జనాలు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.కొందరేమో “అమెరికన్లు సరదాగా పనిచేసుకుంటున్నారులే” అని నవ్వుకున్నారు.మరికొందరు మాత్రం “కష్టపడి పనిచేసేవాళ్లని ఇలా వెక్కిరించడం తప్పు.
శ్రమను గౌరవించాలి” అని సీరియస్ అయ్యారు.ఇంకొందరైతే “అమెరికన్లు ఇలాంటి పనులు చేస్తారా? ఆటోమేషన్ వస్తే బాగుంటుంది కానీ అది జరగడానికి చాలా టైమ్ పడుతుంది కదా” అని ఆలోచిస్తున్నారు.అసలు విషయం ఏంటంటే “అమెరికానే చైనాకి పెద్ద కస్టమర్.వాళ్లనే వెక్కిరిస్తే రిస్క్ కదా” అని ఇంకొకరు కామెంట్ చేశారు.చైనా ప్రభుత్వం మాత్రం ఈ వీడియోని లైట్ తీసుకోలేదు.అమెరికా పన్నులు అన్యాయం అని, ప్రపంచ వాణిజ్య నియమాలకు విరుద్ధం అని, ఇది అసలు కామన్ సెన్స్ లేని పని అని ఫైర్ అయ్యింది.
ఇది “దౌర్జన్యం, బెదిరింపు” అంటూ మండిపడింది.అమెరికా ఇలాగే పన్నులు పెంచుకుంటూ పోతే తాము సైలెంట్ గా ఉండబోమని చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది.