ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది.ఈ సీజన్‌లో సహజంగానే ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయిపోతుంటుంది.
దాంతో జలుబు, దగ్గు, ఫ్లూ, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, న్యుమోనియా వంటి వ్యాధులన్నీ మనపై ఎటాక్ చేస్తుంటాయి.వాటితో పోరాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే కత్తి మీద సామే.
అందుకే వీక్‌గా మారిన ఇమ్యూనిటీ సిస్టమ్ ను స్ట్రోంగ్‌గా మార్చుకోవడం ఎంతో అవసరం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే సూప్ అద్భుతంగా సహాయపడుతుంది.
వర్షాకాలంలో ప్రతి రోజూ మార్నింగ్ ఈ సూప్ ను తాగితే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సూప్ ఏంటో.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చిన్న కప్పు ఎర్ర కందిపప్పు వేసుకుని వాటర్‌తో రెండు సార్లు కడగాలి.
ఆ తర్వాత గ్లాస్ వాటర్ పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఈలోపు ఒక క్యారెట్, టమాటోలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత కుక్కర్‌లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, టమాటో ముక్కలు, నాన బెట్టుకున్న ఎర్ర కందిపప్పు, పావు స్పూన్ పసుపు, రెండు గ్లాసుల వాటర్ వేసుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

ఇలా ఉడికించుకున్న పదార్థాలను వాటర్‌తో సహా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆపై గ్రాండ్ చేసుకున్న మిశ్రమంలో మరి కొద్దిగా వాటర్, రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ మిరియాల పొడి వేసి పది నిమిషాల పాటు మరిగిస్తే వేడి వేడి ఎర్ర కంది పప్పు సూప్ సిద్ధం అవుతుంది.ఈ టేస్టీ అండ్ హెల్తీ సూప్‌ను ప్రస్తుత వర్షాకాలంలో రోజూ మార్నింగ్ తీసుకోవాలి.
తద్వారా రోగ నిరోధక వ్యవస్థ స్ట్రోంగ్‌గా మారుతుంది.సీజన్‌ల్ వ్యాధులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నా పరార్ అవుతాయి.అంతేకాదండోయ్.
ఈ సూప్‌ను డైట్‌లో చేర్చుకుంటే.వెయిట్ లాస్ అవుతారు.
షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది.రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.
మరియు గుండె జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.
