Ram Gopal Varma : నా పెళ్లి ఎప్పుడు అయ్యిందో మర్చిపోయా..? నా కూతురు పుట్టిన తేదీ కూడా తెలియదు

తెలుగు సినిమా గ్రాఫ్ ను మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ).1990 లో ఆయన నాగార్జున తో తీసిన “శివ”( Shiva ) చిత్రం ఎంతటి సెన్సేషన్ అయ్యిందో మనందరికీ తెలుసు.ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న స్టార్ దర్శకులందరు ఆయన శిష్యులే.గొప్ప గొప్ప సినిమాలు తీసినంత మాత్రాన దర్శకులు గొప్ప వాళ్ళు అయిపోరు .ఆ కోవలోకి వర్మ కూడా వస్తాడు.ఐతే ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ తన భార్య గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

 Rgv About His Marriage And Divorce-TeluguStop.com
Telugu Heart Rk, Ram Gopal Varma, Rgv-Telugu Stop Exclusive Top Stories

ఏబియెన్ ఛానల్ లో ప్రసారమయ్యే మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రాం ఓపెన్ హార్ట్ విత్ ఆర్.కె( Open Heart with R.K ).ఏబియెన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధా కృష్ణ( Director Radha Krishna ) గారు ఈ షో కి హోస్ట్.ఈ ప్రోగ్రాం కి ప్రతివారం ఒక ఫేమస్ పర్సనాలిటీని ఆహ్వానించి, వారి వ్యక్తిగత విషయాలు, వృత్తి పరమైన విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు.తాజాగా ఈ షో కి రామ్ గోపం వర్మ అతిధి గా వచ్చారు.

షో లో భాగంగా రాధా కృష్ణ గారు తనకు పెళ్లి ఏ సంవత్సరంలో జరిగింది అని ప్రశ్నించగా వర్మ మతిపోయే సమాధానం ఇచ్చారు.అసలు తనకు ఏ సంవత్సరంలో పెళ్లి అయ్యింది, ఏ సంవత్సరంలో విడాకులు అయ్యింది అనేది గుర్తు లేదని అన్నారు.

తరువాత తన పిల్లల గురించి మాట్లాడుతూ, తనకు ఒక కూతురు ఉందని, కానీ తాను ఏం చేస్తుందో తెలీదని సమాధానం ఇచ్చారు.బహుశా డాక్టర్ అయ్యి ఉండవచ్చు అని సందేహం వ్యక్తం చేసారు.

Telugu Heart Rk, Ram Gopal Varma, Rgv-Telugu Stop Exclusive Top Stories

ఈ మాటలతో రాధా కృష్ణ ఒకింత షాక్ కి గురయ్యాడు.అక్కడితో వర్మ ఆగలేదు.పుట్టిన రోజులు, పెళ్లి రోజులు గుర్తుపెట్టుకోవడం తనకు నచ్చదని, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం వ్యర్థమని తన స్టైల్ లో సమాధానమిచ్చారు ఆర్ జీ వీ.ఏడేళ్లు కలిసి జీవించిన భార్య నుంచి విడాకులు తీసుకొని తానూ స్వతంత్రం పొందలేదని, తన నుంచి విడాకులు తీసుకొని తన భార్య స్వతంత్రం పొందిందని షాకింగ్ కామెంట్స్ చేసారు.ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube