నీరు లేకుండా ఏ ప్రాణి జీవించలేదు.సమస్త ప్రాణకోటికి నీరే ఆధారం.
నీటిని త్రాగటానికే ఎన్నో రకాల అవసరాల కోసం ప్రతి రోజు ఉపయోగిస్తూ ఉన్నాం.అలాగే మనం ప్రతి రోజు పరగడుపున ఒక లీటర్ నీటిని త్రాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.
ముఖ్యంగా బరువు తగ్గటానికి చాలా బాగా సహాయపడుతుంది.క్రమం తప్పకుండ ఒక నెల రోజుల పాటు ప్రతి రోజు ఉదయం పరగడుపున నీటిని త్రాగితే తేడా మీరే గమనించి ఆశ్చర్యపోతారు.
ఉదయం పరగడుపున నీటిని త్రాగితే జీర్ణక్రియ వేగవంతం అయ్యి కొవ్వు వేగంగా కరిగి తద్వారా బరువు తగ్గుతారు.కడుపు నిండిన భావన కలిగి ఆకలి కూడా త్వరగా వేయదు.
బరువు తగ్గాలని అనుకొనే వారికి ఇది ఉత్తమమైన చిట్కా.
జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారు,మద్యపానం, పొగ త్రాగే అలవాటు ఉన్నవారికి కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించటానికి బాగా సహాయాపడుతుంది.
రాత్రి తొందరగా పడుకున్నా ఉదయం లేవగానే చాలా మందికి మత్తుగా ఉంటుంది.అలాంటి వారు ఉదయం ఒక లీటర్ నీటిని త్రాగితే మత్తు వదిలిపోయి ఉత్తేజంగా ఉండటమే కాకుండా అలసట దూరం అవుతుంది.
జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండటం వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.దాంతో మలబద్దకం,గ్యాస్,అసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి.
వృధాప్య ఛాయలు తొందరగా రావు.చర్మం తాజాగా మెరుస్తూ ఉంటుంది.
శరీరానికి అవసరమైన నీటిలో అధిక శాతాన్ని ఉదయమే త్రాగాలి.