నిర్మాతలు భయపడుతున్నారా.. లేక తెలుగువాళ్ళకి అన్యాయం చేస్తున్నారా?

బయటికి ఎంతో అందంగా కనిపించే సినిమా ప్రపంచంలో కనిపించని కష్టాలు ఎన్నో ఉంటాయి అని చెబుతూ ఉంటారు.ముఖ్యంగా షూటింగ్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టే నిర్మాతలది అయితే మాటల్లో చెప్పలేని కష్టమనే చెప్పాలి.

 Tollywood Producers Scaring , Tollywood, Bollywood Actor Murali Sharma, Hyderaba-TeluguStop.com

ఇటీవలికాలంలో మరిన్ని కష్టాలు నిర్మాతలకు వచ్చేసాయి.నేటి రోజుల్లో బాగా ఫేమస్ అయిన నటీనటులందరూ కూడా డిమాండ్ ఉన్నప్పుడే అందినకాడికి గుంజెయాలి అనే విధంగానే వ్యవహరిస్తున్నారు.

ఒకవైపు కోట్లకి కోట్లు పారితోషికం తీసుకునీ మరోవైపు వారి సిబ్బంది ఛార్జీలను కూడా నిర్మాతలనే పెట్టమంటు ఉన్నారట ఇటీవలి కాలంలో ఇదే ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

బాలీవుడ్ నటుడు మురళీ శర్మ.

తెలుగులో కూడా బాగా క్రేజ్ ఉంది.గొప్ప నటుడు కూడా.

రోజుకు నాలుగు లక్షల పారితోషికం తీసుకుంటాడు.ఇవి సరిపోవు అన్నట్లు ఇక వారు సిబ్బందికి కూడా నిర్మాతలే పేమెంట్లు ఇవ్వాలట.

అంతేకాదు ఆయన ముంబై నుంచి షూటింగ్ కోసం హైదరాబాద్ రావాలంటే 3 ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలి.పక్కన ఎవరో ఉంటారు అనుకోకండి.

పక్కన రెండు సీట్లు కూడా ఖాళీనే.ఈయన ఇంతలా డిమాండ్ చేస్తున్న నిర్మాతలు మాత్రం ఒక్కమాట ఎదురు చెప్పడం లేదట.

Telugu Bollywoodmurali, Hyderabad, Mumbai, Producers, Rao Ramesh, Tollywood-Telu

మురళి శర్మ కు క్రేజ్ వుంది నిజమే.కానీ మురళి శర్మ కు ప్రత్యామ్నాయంగా మన టాలీవుడ్ లో ఎవరూ లేరా అంటే.రావు రమేష్ లాంటి గొప్ప నటుల పేర్లు చాలానే వినిపిస్తాయి.తెలుగు వాళ్ళని తెలుగు నిర్మాతల చులకనగా చూస్తున్నారు అన్నది మాత్రం ఇదంతా చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది.

మన వాళ్ళని తీసుకుని ఖర్చు తగ్గించు కోవాలి అనుకోవడం లేదు.బాలీవుడ్ వాళ్లని రప్పిస్తే సినిమాకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారట.తీరా ఇక అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్న విధంగా భారీ బడ్జెట్ పెట్టడం చివరికి నెగిటివ్ టాక్ వస్తే నష్టాలు పాలుకావడం జరుగుతుంది నిర్మాతలు.ఇప్పటికైనా నిర్మాతల సంఘం ఒక తీర్మానం చేసుకొని హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టు పారితోషికం మినహా చార్జీలు చెల్లించే ప్రసక్తి లేదని ఒక మాట మీద నిలబడితే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube