నాచురల్ స్టార్ నాని.తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నా ఈ హీరోకి మాత్రం ప్రత్యేకమైన క్రేజ్.
సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకు ఎంట్రి ఇచ్చి నటనతో ప్రేక్షకులను మెప్పించి తక్కువ సమయంలోనే స్టార్డమ్ సాధించి.ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల నాచురల్ స్టార్ గా కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది బిజీ బిజీ హీరో గానే కొనసాగుతూ ఉన్నాడు.అదే సమయంలో ఇక నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన అక్కడ తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు.
నాని డైరెక్టర్ అవుదామని వచ్చి పొరపాటున హీరో అయిపోయాడు.
అష్ట చెమ్మ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి.
ఇలా ఇప్పటివరకు నాని కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమా నాని కెరీర్ ను కీలక మలుపు తిప్పింది.
ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీకి వచ్చిన నాని ఇప్పుడు మాత్రం స్టార్ హీరోగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు అని చెప్పాలి.కానీ నాచురల్ స్టార్ నాని ఇక ఇలాంటి విలాసవంతమైన జీవితానికి దూరంగానే ఉంటున్నారనని కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం.
నాని హీరోగా కోట్లు సంపాదిస్తున్నప్పటికీ ఈ హీరో తల్లిదండ్రులు మాత్రం తమకు కష్టం మీదనే బ్రతుకుతున్నారట.
నాని హీరోగా ఎదిగేందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అండదండలు అందించిన తల్లిదండ్రులు ఇక ఇప్పుడు కొడుకు హీరో అయ్యి కోట్లు సంపాదిస్తున్న కూడా అతని దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించడడం లేదట. నాని తల్లి ఒక ప్రభుత్వ ఉద్యోగి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ లో పని చేస్తూ ఉంటుంది.ఇప్పటికి నడుచుకుంటూ బస్టాప్ కి వెళ్లడం ఇక నడుచుకునే తిరిగిరావడం చేస్తుందట.
ఇక నాని తండ్రి సైతం ఇప్పటికీ జాబ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు అన్నది తెలుస్తుంది.ఇలా కొడుకు పెద్ద హీరో అయినప్పటికీ వారి తల్లిదండ్రులు మాత్రం నిరాడంబరంగా ఎప్పటిలాగానే తమ సాదాసీదా జీవితాన్ని గడుపుతూ ఉండటం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది అని చెప్పాలి.