1990 కాలం నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ( Chiranjeevi, Nagarjuna, Venkatesh, Balakrishna )టాలీవుడ్ ఇండస్ట్రీని రాణించడం మొదలుపెట్టారు.ఈ నలుగురు హీరోలు ఫ్యామిలీ, యాక్షన్, రొమాంటిక్, డ్రామా వంటి అన్ని కేటగిరీలను టచ్ చేస్తూ సూపర్ హిట్స్ అందుకున్నారు.
అప్పట్లో ఈ నలుగురు హీరోల హవా ఎక్కువగా సాగేది కాబట్టి దిగ్గజ దర్శకులు ఈ నలుగురితోనే ఎక్కువగా సినిమాలు చేసేవారు.ముఖ్యంగా దర్శక ధీరుడు దాసరి నారాయణ రావు ( Dasari Narayana Rao )చిరు, నాగ్, వెంకీ, బాలయ్య బాబులతో సినిమాలు తీసి వారికి ఎన్నో హిట్స్ అందించాడు.
వీరితో మంచి అనుబంధం కూడా ఏర్పరచుకున్నాడు.ఆ సాన్నిహిత్యంతోనే ఈ నలుగురిని హీరోలుగా పెట్టి ఒక సినిమా తీద్దామనుకున్నాడు.
ఆ విషయాన్ని నలుగురు హీరోలకు చెప్పగా వారు కూడా సంతోషంగా అంగీకరించారు.అయితే సినిమా ప్రారంభించడానికి ముందు ఒక్కో హీరో అభిమానులను పిలిపించుకొని దాసరి నారాయణరావు మాట్లాడాడట.అయితే చివరికి అతడికి అర్థమైంది ఏంటంటే, ఈ సినిమా తీస్తే ఎవరో ఒక హీరో అభిమానులు కచ్చితంగా తనని ఏకిపారేస్తారని! ఎందుకంటే ప్రతి అభిమాని కూడా తమ హీరోని తక్కువగా చూపించొద్దని, ఒక్క సీన్‌లో తక్కువగా చూపించినా పరిస్థితి మామూలుగా ఉండదని దాసరి నారాయణరావుకి చిన్న వార్నింగ్ లాంటిది ఇచ్చారట.సాధారణంగా సినిమాలో ఎవరో ఒకరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వక తప్పదు.
పొరపాటున ఒకరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, మరొకరికి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి.
ఇవన్నీ లెక్క చేయకుండా సినిమా తీస్తే అభిమానులు దాసరి నారాయణరావు పై విమర్శలు ఎక్కు పెట్టొచ్చు.అంతేకాకుండా అభిమానులు తమ హీరో గొప్ప అంటే తన హీరో గొప్ప అనుకుంటూ తన్నులాటకు దిగవచ్చు.ఇవన్నీ ఊహించిన దాసరి నారాయణరావు భయపడిపోయి ఆ ప్రాజెక్టు తీయకపోవడమే మంచిది అని అనుకున్నాడట.
ఈ సంగతి చెబితే నలుగురు హీరోలు కూడా సరేనని సైలెంట్ అయిపోయారట.ఒకవేళ నలుగురితో సినిమా తెరకెక్కినట్లయితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయి ఉండేది.అప్పట్లో ఈ గొడవలు ఉన్నాయి కానీ ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు వస్తున్నాయి, ప్రజలు బాగానే ఆదరిస్తున్నారు.ఎవరికి ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా సరే భేదాభిప్రాయాలు వ్యక్తం చేయకుండా సినిమాలను ఫ్యాన్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు రావాలని కోరుకుంటున్నారు.