సాధారణంగా మనం మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు వారి పుట్టిన తేదీ, నక్షత్రాన్ని, సమయాన్ని బట్టి వారికి జాతకం రాయించడం చేస్తుంటాము.ఈ జాతకం ద్వారా వారు భవిష్యత్తు ఎలా ఉంటుంది? వారి జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నాయా? ఉంటే వాటి పరిహారం ఏమిటి? అనే విషయాలను పండితులు చెబుతుంటారు.అదేవిధంగా వారు జన్మించిన వారము అనగా సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ వారంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది? వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం…
ఆదివారం:
ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైన వారు.వీరికి జ్ఞాపకశక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది.
ఏదైనా ఒక విషయం పై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు.వీరు ఓటమిని ఏమాత్రం అంగీకరించరు.ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు ఈ క్రమంలోనే కొన్ని విషయాలలో మొండి పట్టుదలతో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు.
సోమవారం:
సోమవారం జన్మించిన వారు ఎక్కువ ఆలోచనలు చేస్తూ, అధిక మానసిక ఒత్తిడికి గురవుతుంటారు.పౌర్ణమికి దగ్గరగా ఉన్న సోమవారం రోజు జన్మించిన వారు ఎక్కువ పాజిటివ్ గా ఉంటారు.అదే అమావాస్య కు దగ్గరగా ఉన్న సోమవారం జన్మించిన వారు ఎల్లప్పుడు మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు.
మంగళవారం:
మంగళవారం జన్మించిన వారిలో ధైర్యసాహసాలు ఎక్కువగా ఉండటం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలలో పూర్తి చేస్తారు.మంగళవారం పుట్టిన వారు తరచూ చిన్నచిన్న వివాదాలకు గురవుతుంటారు.
వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురౌతాయి.
బుధవారం:
బుధవారం పుట్టిన వారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాలలో విజయం సాధిస్తారు.బుధవారం జన్మించిన వారు ఏ విషయం వారి మనసులో పెట్టుకోకుండా ఒకే విషయం గురించి పదేపదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతారు.
గురువారం:
గురువారం జన్మించిన వారిలో జ్ఞానం, మాటకారితనం ఎక్కువగా ఉంటుంది.అందుకే టీచర్లు, లాయర్లు ఎక్కువ భాగం గురువారం జన్మించిన వారు ఉంటారు.వీరి జీవితంలో డబ్బుకు కొదవు ఉండదు.
శుక్రవారం:
శుక్రవారం పుట్టిన వారికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది.వీరికి డబ్బు ఏమాత్రం లెక్క ఉండదు ఎంత పడితే అంత ఖర్చు పెడుతూనే ఉంటారు.విందు, వినోదాలలో పాల్గొనడం వీరికి ఎంతో ఇష్టం
శనివారం:
శనివారం జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు.వీరి జీవితంలో కష్టనష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు.
అందరికి ఎంతో నమ్మకంగా ఉంటారు.శనివారం పుట్టిన వారితో స్నేహం చేయడం ఎంతో మంచిది.