ప్రస్తుతం ఇండియాలో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందుతున్న నటులలో జగపతి బాబు( Jagapathi Babu ) ఒకరు.ఈయన ఒకప్పుడు హీరోగా చేసిన సినిమాలు అన్నీ మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ప్రేక్షకులు కూడా విపరీతంగా అలరించేవి.
ఇక ఈయన ఫ్యామిలీ హీరోగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇలాంటి జగపతిబాబు తీసిన చాలా సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల ఆయన మార్కెట్ అనేది బాగా దెబ్బతింది.
ఇక దానివల్ల ఆయన సినిమాల్లో హీరోగా కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం కూడా స్టార్ట్ చేశారు.

అప్పటినుంచి ఆయనకు వరుస విజయాలు వస్తున్నాయి.అలాగే చాలా మంచి క్యారెక్టర్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులకు మెప్పిస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే జగపతిబాబుకి సూపర్ డూపర్ సక్సెస్ లు అందించిన ఎస్వీ కృష్ణారెడ్డి( SV Krishna Reddy ) దర్శకత్వంలో జగపతిబాబు చాలా సినిమాలు చేశాడు.
ఇక ఇప్పుడంటే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ గా ఉన్నాడు కానీ ఒకప్పుడు వీళ్ళ కాంబో లో వచ్చిన శుభలగ్నం, మావిచిగురు లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.కానీ ఇప్పుడు జగపతి బాబు ఎస్వి కృష్ణారెడ్డిని అసలు పట్టించుకోవట్లేదు అనే వార్తలైతే వస్తున్నాయి.

ఇప్పుడు ఇలాంటి సమయంలో ఆయనను జగపతిబాబు పట్టించుకోకపోవడం పట్ల ఇండస్ట్రీలో చాలామంది చాలా రకాల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇప్పుడున్న సిచువేషన్ లో కృష్ణారెడ్డి తో జగపతిబాబు ఒక సినిమా కనక చేసినట్లయితే మళ్లీ ఆయనకు మార్కెట్ ఏర్పడుతుంది.దానివల్ల డైరెక్టర్ గా తనని తాను మళ్ళీ ఇంకొకసారి ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి.కాబట్టి ఆయనకు అవకాశం ఇస్తే బాగుండేదని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జగపతి ప్రతి స్టార్ హీరో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు…
.