ఈమద్య కాలంలో అమ్మాయిల నుండి అమ్మమ్మల వరకు మేకప్ లేకుండా బయటకు వెళ్లడం లేదు.అవసరం ఉన్నా లేకున్నా కూడా ఇంత మంది మేకప్ వేసుకుని మరీ బయటకు వెళ్తున్నారు.
మేకప్ వేసుకోవడం తప్పు అనడం లేదు.కాని ఆ మేకప్ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
ఆ విషయాన్ని వారు గుర్తిస్తే బాగుంటుందని నిపుణులు అంటున్నారు.ఆరోగ్యంను కాపాడుకుంటూ మేకప్ అవ్వాలి తప్ప అనారోగ్యంను తెప్పిపెట్టేలా మేకప్ వేసుకోవడం మంచిది కాదు.
అతిగా మేకప్ వేసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు వస్తాయని ఇప్పటికే వెళ్లడయ్యింది.
పలువురు సినీ నటులు మేకప్ కారణంగానే క్యాన్సర్ బారిన పడుతున్నారు.
ఇక తాజాగా వెళ్లడయిన విషయం ఏంటీ అంటే గర్బినిలు మేకప్ వేసుకుంటే వారి గర్బంలో పెరుగుతున్న పిండంపై ప్రభావం పడుతుందట.ఈ విషయాన్ని దాదాపు 150 మందిపై ప్రయోగం చేసి మరీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
గర్బవతిగా ఉన్న సమయంలో మేకప్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మేకప్ వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
మేకప్ వేసుకున్న సమయంలో శ్వాస మరియు ఇతరత్ర ద్వారాల ద్వారా రసాయనాలు గర్బంలోని శిషువుకు చేరే అవకాశం ఉంటుంది.అలా చేరడం వల్ల అత్యంత ప్రమాదం శిషువుకు కలుగుతుంది.గర్బంతో ఉన్న సమయంలో మేకప్‌ను ఎక్కువగా వేసుకోవడం వల్ల పుట్టే పిల్లల్లో రోగ నిరోదక శక్తి తక్కువగా ఉంటుందని అంటున్నారు.
అంటే ఎక్కువగా తరచుగా అనారోగ్యం బారిన పడటంతో పాటు, పెద్దయ్యాక కూడా ఆ ప్రభావం ఉంటుందని అంటున్నారు.అందుకే ఆ కొన్ని నెలల పాటు మేకప్‌కు దూరంగా ఉంటే పోయేది ఏమీ లేదు.
అందుకే పిల్లల భవిష్యత్తు కోసం అయినా మేకప్‌కు దూరంగా ఉండాలి.
నలుగురికి ఉపయోగపడే ఈ విషయాన్ని స్నేహితులతో షేర్ చేసుకోండి.