మరోసారి గ్యాస్ లీక్ వ్యవహారం... అర్ధరాత్రి భయాందోళనలో ప్రజలు

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన విషవాయువు లీక్ ఘటన ఒక్కసారిగా ప్రజలని తీవ్ర భయాందోళనకి గురి చేసింది.

ఈ ఘటన కారణంగా 11 మంది చనిపోయారు.

వందల మంది అస్వస్థతకి గురయ్యారు.ఒక్కసారిగా జాతీయ స్థాయిలో ఈ ఘటన సంచలనంగా మారింది.

ఇక ఈ ప్రమాదం సంభవించిన ఫ్యాక్టరీ సమీపంలో గ్రామాలని ఖాళీ చేయించారు.అయిన కూడా ఇంకా చుట్టూ ప్రజలని ఈ ఘటన భయపెడుతూనే ఉంది.

ఇక ఆ ఫ్యాక్టరీ నుంచి విడుదల అవుతున్న విషవాయువుని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఒక టీంని రంగంలోకి దించి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది.అయితే గత అర్ధ రాత్రి కూడా మళ్లీ పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ కావడంతో జనం భయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

Advertisement

ఎన్‌ఏడీ, బాజీ జంక్షన్, గోపాలపట్నం, సుజాతనగర్, పెందుర్తి, అడివివరం, పినగాడి, సింహాచలం, ప్రహ్లాదపురం, వేపగుంట ప్రాంతాలకు చెందిన వేలాదిమంది ప్రాణాలు అరచేత పట్టుకుని అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.న్యూట్రలైజర్‌ను ఉపయోగించి విషవాయువు బయటకు రాకుండా గడ్డకట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతానికి ఈ ప్రాంతం సురక్షితంగా ఉందని చెబుతున్నప్పటికీ ప్రజలలో మాత్రం భయం పోలేదు.మరో వైపు జనావాసంలో ఉన్న ఈ ఫ్యాక్టరీని తొలగించాలని డిమాండ్ ఇప్పుడు వినిపిస్తుంది.

ప్రభుత్వం చనిపోయిన వారికి కోటి రూపాయిలు నష్ట పరిహారం ఇచ్చిన కూడా మరోసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే మాత్రం ఫ్యాక్టరీని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు