గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌ చనిపోయినట్లుగా ప్రచారం.. అవాస్తవమన్న అమెరికా పోలీసులు

పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా( Sidhu Moose Wala ) హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌( Goldy Brar )ను అతని ప్రత్యర్ధులు కాల్చి చంపినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి.అమెరికాలోని హోల్ట్ అవెన్యూలో మంగళవారం సాయంత్రం 5.25 గంటలకు స్నేహితుడితో కలిసి ఇంటి బయట వుండగా అగంతకులు గోల్డీబ్రార్‌పై కాల్పులు జరిపినట్లుగా మీడియా పేర్కొంది.అయితే ఈ వార్తలపై అమెరికా పోలీసులు స్పందించారు.

 Goldy Brar Not Dead, Us Police Deny Reports Of Gangsters Murder ,goldy Brar , U-TeluguStop.com

కాల్పుల్లో మరణించిన వ్యక్తి గోల్డీబ్రార్ కాదని.ఫ్రెస్నో పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి జేవియర్ గాల్డ్నె‌గా తెలిపారు.కాల్పుల తర్వాత తమ డిపార్ట్‌మెంట్‌కు ప్రపంచ నలుమూలల నుంచి ఫోన్లు వస్తున్నాయి.అసలు ఇలాంటి వదంతులు ఎలా మొదలయ్యాయో తెలియదని లెఫ్టినెంట్ జే డూలే అన్నారు.

ఎవరీ గోల్డీ బ్రార్:

Telugu American, Delhi, Goldy Brar, Gurlal Brar, Punjab-Telugu NRI

ఇతని అసలు పేరు సతీందర్ సింగ్.పంజాబ్ రాష్ట్రం( Punjab State )లోని ముక్త్‌సర్ సాహిబ్ ప్రాంతానికి చెందిన వాడు.కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో బిష్ణోయ్ తరపున గోల్డీ బ్రార్ వసూళ్ల దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలో లారెన్స్ బిష్ణోయ్‌కి.మరో గ్యాంగ్‌స్టర్ దవిందర్ బంభిహాకు మధ్య గ్యాంగ్ వార్ నడుస్తోంది.పంజాబ్ సహా ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో రెండు గ్యాంగ్‌లు పరస్పరం దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతున్నాయి.

గోల్డీ బ్రార్ సన్నిహితుడు, విద్యార్ధి నేత మిద్దుఖేరాను బంభిహా గ్యాంగ్ హతమార్చింది.దీనికి ముందు బ్రార్ సమీప బంధువు గుర్లాల్ బ్రార్ కూడా హత్యకు గురయ్యాడు.

ఇతను బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ హత్యకు ప్రతీకారంగా కాంగ్రెస్ నేత గురులాల్ పహిల్వాన్‌ను లారెన్స్ గ్యాంగ్ హత్య చేసింది.ఈ కేసులో కీలక నిందితుడిగా వున్న గోల్డీ బ్రార్ కెనడాకు పారిపోయాడు.

పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ గోల్డీ బ్రార్ ప్రధాన నిందితుడు.సిద్ధూని హతమార్చేందుకు వ్యూహ రచన, దానిని అమలు చేయడం, షూటర్లకు ఆయుధాలు పంపడం వంటి విషయాలను బ్రార్ పర్యవేక్షించినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.

గోల్డీబ్రార్‌ను భారత ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఉగ్రవాదిగా ప్రకటించింది.

Telugu American, Delhi, Goldy Brar, Gurlal Brar, Punjab-Telugu NRI

యూఏపీఏలోని సెక్షన్ 35లోని సబ్ సెక్షన్ (1)లోని క్లాజ్ (ఏ) ద్వారా అందించిన అధికారాలను అమలు చేస్తున్నట్లు హోంశాఖ పేర్కొంది.నాల్గవ షెడ్యూల్‌లో అతని పేరును 56వ ఉగ్రవాదిగా చేర్చినట్లు హోం మంత్రిత్వశాఖ తెలిపింది.బ్రార్ అతని అనుచరులు పంజాబ్‌లో శాంతి, మత సామరస్యం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నినట్లుగా హోంశాఖ పేర్కొంది.

విధ్వంసం, టెర్రర్ మాడ్యూళ్లను పెంచడం, టార్గెట్ కిల్లింగ్స్, ఇతర దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఈ గ్యాంగ్ పాల్పడుతున్నట్లు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube