ఇటీవలి కాలంలో ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా ఎంతలా పెరిగిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.స్టార్ హీరో సినిమా అయితే కావాల్సినన్ని కమర్షియల్ హంగులు.
అందమైన హీరోయిన్.అందర్నీ భయపెట్టే విలన్.
అబ్బురపరిచే ఫైట్ సన్నివేశాలు.ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉండాలి.
కానీ చిన్న సినిమాలకు ఇవేవీ అక్కరలేదు.ఏ కథను అయితే నమ్ముకుని సినిమా తీస్తారో ఇక ఆ కథ ప్రేక్షకులకు నచ్చితే చాలు.
సినిమా హిట్ అవుతుంది.ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో చిన్న సినిమాలోని కొత్తదనం ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.
దీంతో చిన్న హీరోల సినిమాలకు కూడా మంచి విజయాలు అందిస్తూ ఆదరిస్తున్నారు ప్రేక్షకులు.
ఇంత బాగా బిజినెస్ జరుగుతుంటే నిర్మాతలు ఊరుకుంటారా ఇక ఇటు వైపు ఓ కన్నీశారు.
ప్రస్తుతం కమర్షియల్ హంగులతో కూడిన పెద్ద సినిమాలు తీయడంతో పాటు చిన్న సినిమాలను కూడా తీసేస్తున్నారు.టాలీవుడ్లోని బడా ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా కొనసాగుతున్న మైత్రి మూవీ మేకర్స్ చిరంజీవి 154 బాలయ్య 107, బన్నీ, విజయ్ దేవరకొండ లాంటి హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలే కాదు లావణ్య త్రిపాఠి తో హ్యాపీ బర్తడే, వైష్ణవ్ తేజ్ తో ఉప్పెన సినిమాలు కూడా చేసింది.
ఇక సుధీర్ బాబు, కృతి శెట్టి కామినేషన్ లో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది.అంతే కాదు కిరణ్ అబ్బవరం తో మీటర్ అనే సినిమా కూడా చేస్తూ ఉండటం గమనార్హం.
నిర్మాణ సంస్థ అంటేనే గీతాఆర్ట్స్ అన్నట్లుగా పేరు సంపాదించుకున్న ఈ ప్రొడక్షన్ సంస్థ లో బడ్జెట్ మూవీస్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండటం గమనార్హం.దీని కోసం ప్రత్యేకంగా గీతాఆర్ట్స్ 2 బ్యానర్ ను ఏర్పాటు చేశారు.
గీతా ఆర్ట్స్ ద్వారా ఎంతో మంది యువకులను ప్రోత్సహిస్తున్నారు.ఇందులో భాగంగా వచ్చినవే పిల్లా నువ్వు లేని జీవితం, బలే బలే మగాడివోయ్, గీత గోవిందం లాంటి సినిమాలు.
ఇటీవలి కాలంలో చావు కబురు చల్లగా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు కూడా వచ్చాయి.ఇక ఇప్పుడు నిఖిల్ 18 పేజీస్ సినిమా కూడా గీత ఆర్ట్స్ 2 లోనే నిర్మితమవుతుంది.
మరికొన్ని సినిమాలకు కూడా ఇప్పటికే అడ్వాన్సులు కూడా ఇచ్చేశారట.
![Telugu Banners, Geeta, Mythri Makers, Nikhil Pages, Sitara, Small-Telugu Stop Ex Telugu Banners, Geeta, Mythri Makers, Nikhil Pages, Sitara, Small-Telugu Stop Ex]( https://telugustop.com/wp-content/uploads/2022/07/Geeta-Arts-2-Sitara-Entertainments.jpg)
ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్న నిర్మాణసంస్థ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇక ఇప్పుడు లోబడ్జెట్ సినిమా తెరకెక్కించేందుకు కూడా సిద్ధమైంది.జొన్నలగడ్డ తో డీజే టిల్లు అనే కొత్త ప్రయోగం చేసి హిట్ కొట్టిన నిర్మాతలు జాతి రత్నాలు ప్రేమ్ నవీన్ పోలిశెట్టి లో అనగనగా ఒక రోజు, బెల్లంకొండ గణేష్ ని హీరోగా పరిచయం చేస్తూ స్వాతి ముత్యం.పంజా వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమా.
ఇలా చాలానే చిన్నచిన్న సినిమాలలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.