సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే ఖచ్చితంగా బ్యాగ్రౌండ్ ఉండే తీరాలి అనేది చాలా రోజులుగా అందరూ అంటున్న మాట.ఒక్కోసారి ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా వారిలో టాలెంట్ లేకపోతే మాత్రం ఎవ్వరు ఏమీ చేయలేరు.
ఇక ఈ రెండు రకాలు కాకుండా మూడో రకం వారు కూడా ఉంటారు.బోలెడంత టాలెంట్ ఉంటుంది.
అంతకు మించిన బ్యాగ్రౌండ్ ఉంటుంది.ఆయన కూడా సక్సెస్ వారి దరిదాపుల్లోకి కూడా రాదు.
అలాంటి వారు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి త్వరలోనే కనుమరుగైపోతూ ఉంటారు.వారి ఫెయిల్యూర్ కి కేవలం విజయాలు మాత్రమే దొరకపోవడం విశేషం.అలా ఎంతో మంచి బ్యాగ్రౌండ్ నుండి అంతకన్నా మంచి టాలెంట్ ఉంది సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఫెయిల్యూర్స్ గా నిలబడిన కొంతమంది హీరోయిన్స్ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కొణిదెల నిహారిక
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి ఎన్నో అవకాశాలు దక్కినా కూడా నిహారిక( Niharika ) మాత్రం విజయాలను అందుకోలేకపోయింది ప్రస్తుతం నిర్మాణ బాధ్యతలు కూడా చేయబడుతుంది.
జీవిత రాజశేఖర్ కుమార్తెలు
జీవిత రాజశేఖర్కి ఇద్దరి కుమార్ శివాని,( Shivani ) శివాత్మిక( Shivatmika ) వీరిద్దరూ డాక్టర్సే అయినా కూడా హీరోయిన్స్ అవ్వాలని కలలు కంటున్నారు.కానీ ఎందుకో వారిని ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది.ఇద్దరికీ ఇప్పటికీ సరైన స్థానం రాకపోవడం విశేషం.
సుప్రియ యార్లగడ్డ
అక్కినేని బ్యాక్ గ్రౌండ్ తో నాగార్జున మేనకోడలు సుప్రియ( Supriya ) సినిమా ఇండస్ట్రీ కి ఏంటి ఇచ్చింది.పవన్ కళ్యాణ్ తో మొదటి సినిమా నటించినప్పటికీ ఈ అమ్మాయికి హీరోయిన్ గా ఎదగడం కుదరలేదు.
అక్షర హాసన్
కమల్ హాసన్ కి కూతురు, శృతిహాసన్ కి చెల్లెలు అయినప్పటికీ అక్షర హాసన్ కి( Akshara Haasan ) హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కలేదు ప్రస్తుతం ఇంకా ఎవరైనా సినిమా అవకాశం ఇవ్వకపోతారా అని అక్షర ఎదురుచూస్తుంది.
మంచు లక్ష్మి
మంచు లక్ష్మి( Manchu Lakshmi ) హీరోయిన్ గా మొదట ఎంట్రీ ఇవ్వలేదు కానీ యాంకర్ గా హోస్ట్ గా బాగానే వర్కౌట్ అయింది.ఆ తర్వాత ఎప్పుడైతే నటి అయిందో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి ఇప్పటికి మంచు లక్ష్మికి సరైన సినిమాలు లేవు.
మంజుల ఘట్టమనేని
కృష్ణ కుమార్తెగా మంజుల ఘట్టమనేని( Manjula Ghattamaneni ) హీరోయిన్ గానే ఎంట్రీ ఇచ్చింది అయినా కూడా ఎందుకో ఆమెకు సినిమా ఇండస్ట్రీ పెద్దగా వర్కౌట్ అవలేదు.మొదట్లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా అవకాశం వచ్చినప్పటికీ కృష్ణ ఫ్యాన్స్ అభ్యంతర వ్యక్తం చేయడంతో ఆమె నటన నుంచి తప్పుకుంది ఇప్పుడు లేటు వయసులో గట్టిగా గుర్తింపు తెచ్చుకోవాలనే తహతలాడుతుంది.