ఆఫీస్‌లో పని ఒత్తిడి, పోషకాల కొరత, పొల్యూషన్, కంటి నిండా నిద్రలేకపోవడం, ఆహారపు అలవాట్లు, స్మోకింగ్, డ్రింకింగ్ వంటి కారణాల వల్ల కొందరు పురుషుల్లో హెయిర్ ఫాల్( Hairfall ) అనేది చాలా అధికంగా ఉంటుంది.జుట్టు విపరీతంగా ఊడిపోవడం వల్ల మగవారు తీవ్ర ఆందోళనకు లోనవుతుంటారు.
ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ఏవేవో మార్గాలను ఎంచుకుంటూ ఉంటాయి.అయితే పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూపర్ టిప్స్ కొన్ని ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టిప్-1:
ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అల్లం జ్యూస్,( Ginger Juice ) రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.40 నిమిషాల అనంతరం రసాయనాలు లేని షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఇలా చేశారంటే జుట్టు రాలడం తగ్గి దట్టంగా పెరుగుతుంది.

టిప్-2:
అన్నం వండిన తర్వాత వచ్చే గంజి జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది.గంజి మరియు ఉల్లిపాయ జ్యూస్( Onion Juice ) ను సమానంగా తీసుకుని మిక్స్ చేసి తలకు పట్టించాలి.గంట అనంతరం హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటించన కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.హెయిర్ రూట్స్ స్ట్రోంగ్ గా మరియు హెల్తీగా మారతాయి.
చుండ్రు సమస్య ఉన్న కూడా దూరం అవుతుంది.

టిప్-3:
రెండు ఉసిరికాయలను తీసుకుని గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఉసిరికాయ పేస్ట్ లో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కలిపి తలకు ప్యాక్ మాదిరి వేసుకోవాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి.జుట్టు రాలడాన్ని అరికట్టడంతో, కొత్త జుట్టు ఎదుగుదలను ప్రోత్సహించడంలో ఈ రెమెడీ కూడా ఉత్తమంగా హెల్ప్ చేస్తుంది.







