మీ శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉందా? అయితే ఈ జ్యూస్ లను..!

మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.ప్రపంచంలో డబ్బు లేని ఇల్లు ఉంటుంది.

 Iron Rich Drinks To Boost Your Hemoglobin,hemoglobin,iron Rich Drinks,iron Rich-TeluguStop.com

కానీ అనారోగ్య సమస్యలు లేని ఇల్లు దాదాపు ప్రపంచంలో లేదని కచ్చితంగా చెప్పవచ్చు.ఎందుకంటే ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక వ్యాధి కచ్చితంగా ఉంటుంది.

ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలలో రక్తహీనత( Anemia ) ఎక్కువగా కనిపిస్తున్న అనారోగ్య సమస్య.అంతే కాకుండా ఈ సమస్య మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యను త్వరగా అధిగమించాలంటే బీట్రూట్ రసం, బచ్చలి కూర, పుదినా జ్యూస్ లలో ఏదైనా ఒకటి క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి.


ఇలా చేయడం వల్ల త్వరగా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే బీట్రూట్ రసం( Beetroot Juice ) శరీరంలో రక్త స్థాయిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే బచ్చలి కూర పుదీనా కూడా శరీరంలో రక్త కొరతను లేకుండా చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

అంతే కాకుండా దానిమ్మ రసం( Pomegrante Juice ) కూడా శరీరంలో రక్తాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇందులో తగినంత విటమిన్ సి కూడా ఉంటుంది.

కాబట్టి ఇది శరీరంలోనీ రక్తాన్ని త్వరగా వృద్ధి చెందేలా చేస్తుంది.అలాగే నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.


దీని వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం( Hemoglobin ) పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.అంతే కాకుండా నేరడు కాయా, ఉసిరి రసాలను తాగడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే క్యారెట్, పాలకూర జ్యూస్ లను తాగడంతో శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.కాబట్టి రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ జ్యూస్ లలో ఏదో ఒక దానిని క్రమం తప్పకుండా తాగుతూ ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube