నువ్వులు.ఇవి మనకు తెలుపు మరియు నలుపు రంగుల్లో లభ్యమవుతున్నాయి.
చూడటానికి చాలా చిన్న పరిమాణంలో కనిపించినా నువ్వుల్లో పోషకాలు మాత్రం లెక్కకు మిక్కిలిగా ఉంటాయి.కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ప్రోటీన్, విటమిన్ బి, ఫైబర్ తో సహా ఎన్నో పోషకాలు నువ్వుల్లో ఉంటాయి.
కొలెస్ట్రాల్ మరియు సోడియం పువ్వుల్లో అస్సలు ఉండవు.అందుకే ఆరోగ్యపరంగా ఇవి చాలా మేలు చేస్తాయి.
ముఖ్యంగా రోజుకు రెండు స్పూన్ల నువ్వులను తేనెతో కలిపి తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

ఇటీవల రోజుల్లో ఎంతో మంది చిన్న వయసులోనే మోకాళ్ళు, కీళ్ల నొప్పులంటూ తిప్పలు పడుతున్నారు.అయితే నువ్వులు మరియు తేనెలో కాల్షియం ప్రోటీన్ తో సహా ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.అందువల్ల నువ్వులను తేనెతో కలిపి రోజు కనుక తీసుకుంటే బోన్ డెన్సిటీ పెరుగుతుంది.
మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు( Knee pains, joint pains ) వేధించకుండా ఉంటాయి.

రెండు స్పూన్ల నువ్వులకు ఒక స్పూన్ తేనె ( Honey )కలిపి ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్( Immunity Power ) పెరుగుతుంది.ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం లభిస్తుంది.నెలసరి సమయంలో మహిళలు పొత్తి కడుపు నొప్పి, కాళ్ళు లాగేయడం, నడుము నొప్పి వంటి వాటితో బాగా ఇబ్బంది పడుతుంటారు.
అయితే నిత్యం నువ్వులు తేనె కలిపి తీసుకుంటే ఆయా సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.నువ్వులను తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుంది.
జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.చాలామంది తమ జుట్టు అధికంగా రాలిపోతుందని బాధపడుతుంటారు.
అలాంటి వారికి కూడా నువ్వులు తేనె మిశ్రమం ఉపయోగకరంగా ఉంటుంది.నువ్వుల్లో ప్రోటీన్ రిచ్ గా ఉంటుంది.
తేనెలో కూడా జుట్టు ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు ఉంటాయి.వీటిని కలిపి తీసుకుంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.