ఈ వారం థియేటర్లలో విడుదల కానున్న సినిమాలలో మ్యాడ్ స్క్వేర్(Mad Square) సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.స్వాతిరెడ్డి సాంగ్(Swathi Reddy Song) అయితే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.2 గంటల 10 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ సినిమా ఇప్పటికే సెన్సార్(censor) కార్యక్రమాలను పూర్తి చేసుకోగా సెన్సార్ బోర్డ్ నుంచి ఈ సినిమాకు యూ/ఏ (U/A)సర్టిఫికెట్ వచ్చింది.భీమ్స్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా థమన్ కూడా ఈ సినిమా కోసం పని చేస్తున్నారని సమాచారం అందుతోంది.
మ్యాడ్ ఫస్ట్ పార్ట్ ను మించే విధంగా మ్యాడ్ స్క్వేర్ ఉండబోతుందని తెలుస్తోంది.ఈ సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

లడ్డూ పెళ్లి చుట్టూ, గోవాలో జరిగే సన్నివేశాలతో ఈ సినిమా ఉంటుందని భోగట్టా.ఎక్కడా బోర్ కొట్టకుండా మేకర్స్ ఈ సినిమాను ప్లాన్ చేశారని తెలుస్తోంది.పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే విడుదలవుతున్నా బుకింగ్స్ విషయంలో ఈ సినిమా టాప్ లో ఉంది.ఓవర్సీస్ ప్రింట్స్ వర్క్ వల్ల మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ రేపు ఉదయం విడుదల కానుందని సమాచారం అందుతోంది.

సింపుల్ గానే ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నారని తెలుస్తోంది.ఓవర్సీస్ లో ఈ సినిమాకు సంబంధించి కలెక్షన్లు ఇప్పటికే లక్ష డాలర్లు దాటాయని భోగట్టా.ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar) ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారని ఆ సాంగ్ సినిమాకు స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది.మ్యాడ్ స్క్వేర్ మూవీ బాక్సాఫీస్(Mad Square Movie Box Office) ను షేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.
మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఒకింత భారీ స్థాయిలోనే ఉండే ఛాన్స్ అయితే ఉంది.