ఒక అమ్మాయి వల్లే జీవితం నాశనమైంది... లవ్ స్టోరీ బయట పెట్టిన నటుడు హర్షవర్ధన్!

హర్షవర్ధన్(Harsha Vardhan) సినీ ఇండస్ట్రీలో నటుడిగా రచయితగా కూడా ఈయన ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.ఇక ఇటీవల కాలంలో హర్షవర్ధన్ పెద్ద ఎత్తున సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

 Actor Harasha Vardhan Reveals His Love Story, Harsha Vardhan, Love Story, Court-TeluguStop.com

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోర్టు(Court) సినిమాలో కూడా ఈయన లాయర్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న హర్షవర్ధన్ ఇటీవల ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా ఈయన తన లవ్ స్టోరీ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

హర్షవర్ధన్ ఐదుపదుల వయసులో ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు ఈయన తన జీవితంలో సింగిల్గానే ఉంటున్నారు.

అయితే ఇలా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం లేకపోలేదని ఒక అమ్మాయి కారణంగానే తాను ఇలా బ్యాచిలర్ గా ఉండాల్సి వచ్చిందని తెలిపారు.తాను అందరిలాగే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను ఇద్దరం ఏడు సంవత్సరాల పాటు చాలా సిన్సియర్ గా ప్రేమించుకున్నాము.

నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మేమిద్దరం ప్రేమలో ఉన్నామని తెలిపారు.

Telugu Actressharsha, Harsha Vardhan, Harshavardhan, Love Story, Tollywood-Movie

ఇక అమ్మాయి నాతో ఎప్పుడూ చాలా మంచిగా మాట్లాడేది.మనం పెళ్లి చేసుకొని అనాధ ఆశ్రమం నుంచి ఒక నలుగురు పిల్లల్ని దత్తత(Adoption of four children) తీసుకుందామని చెప్పడంతో తన మనసు ఎంతో మంచిది అనుకున్నాను అయితే ఒక రోజు ఉన్న ఫలంగా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని నా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది.అలా ఒక అమ్మాయిని ఏడేళ్లు ప్రేమించగా అమ్మాయి మోసం చేయడంతో ఇకపై జీవితంలో అమ్మాయిలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను.

ఇక పిల్లల్ని దత్తత తీసుకుంటే జీవితంలో అడ్జస్ట్ అయి బతకాల్సి ఉంటుందని పిల్లల్ని కూడా దత్తత తీసుకోకుండా నా జీవితాన్ని నాకు ఇష్టం వచ్చినట్టుగా గడుపుతున్నాను అంటూ హర్షవర్ధన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube