అందాన్ని పెంచే పసుపు.. ఏయే సమస్యకు ఎలా వాడాలో తెలుసా?

పసుపు.దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

 Wonderful Skin Care Benefits With Turmeric Powder! Turmeric Powder, Turmeric Pow-TeluguStop.com

ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉండే పసుపు ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.అందుకే పసుపును రోజు ఏదో ఒక రూపంలో తీసుకోమని చెబుతుంటారు.

అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని పెంచడానికి, అనేక చర్మ సమస్యలను నివారించడానికి కూడా పసుపు ఉత్తమంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ పసుపును ఏయే సమస్యకు ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Clear Skin, Skin, Latest, Skin Care, Skin Care Tips, Turmeric Powde

మొటిమలు చాలా మందిని చాలా కామన్ గా వేధించే స‌మ‌స్య‌.అయితే మొటిమలను నివారించుకోవడానికి తెగ హైరానా పడిపోతుంటారు.కానీ పసుపుతో చాలా సులభంగా, వేగంగా మొటిమలకు బై బై చెప్పవచ్చు.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు( turmaric ), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ), రెండు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్( Tea tree essential oil ), హాఫ్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతల అప్లై చేసుకుని 20 నిమిషాల అనంత‌రం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఇలా చేస్తే మొటిమలు, మరియు వాటి తాలూకు మచ్చలు దెబ్బకు పరార్ అవుతాయి.

స్కిన్ వైట్నింగ్ కు పసుపు సహాయపడుతుంది.ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్‌ పౌడర్( Orange Peel Powder ), వన్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని బాగా కలిపి ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి.20 నిమిషాల అనంతరం ఫేస్ వాష్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే స్కిన్ వైట్ గా, బ్రైట్ గా మెరుస్తుంది.

Telugu Tips, Clear Skin, Skin, Latest, Skin Care, Skin Care Tips, Turmeric Powde

చిన్న వయసులోనే ముడతలతో బాధపడుతున్న వారు వన్ టేబుల్ స్పూన్ పసుపులో, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్( Almond oil ), ఒక గుడ్డు పచ్చ సొన వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసుకుని 20 నిమిషాల అనంతరం ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే ముడతలు మాయమవుతాయి.చర్మం టైట్ గా మారుతుంది.ఇక డార్క్‌ సర్కిల్స్ తో మదన పడుతున్న వారు వన్ టేబుల్ స్పూన్ పసుపులో వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ కొద్దిరోజుల్లోనే మాయం అవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube