టాటూ వలన ఈ ఘోరమైన ప్రమాదం రావొచ్చు

Getting Tattoo With Organic Colors Can Cause Skin Cancer – Study

టాటూ … పచ్చబొట్టుకి ఒక అధునాతనమైన పేరు.కాని పచ్చబోటు వేసే పద్ధతులే మారిపోయాయి.

 Getting Tattoo With Organic Colors Can Cause Skin Cancer – Study-TeluguStop.com

ఇప్పుడున్న ఫ్యాషన్ మైండెడ్ ట్రెండ్ లో టాటూ వేయించుకోవడం అనేది ఒక ఫ్యాషన్ స్టెట్‌మెంట్ అయిపోయింది.ఆడ, మగ తేడా లేకుండా, ఎక్కడపడితే అక్కడ టాటూ వేయించుకుంటున్నారు.

అనారోగ్యకరమైన పద్దతిలో టాటూ వలన యువత ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

 Getting Tattoo With Organic Colors Can Cause Skin Cancer – Study-Getting Tattoo With Organic Colors Can Cause Skin Cancer – Study-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యూరోపియన్ కమిషన్ యొక్క జాయింట్ రీసెర్చి సెంటర్ అందించిన రిపోర్టు ప్రకారం టాటూలు వేయించుకునే వారిలో 5% మందికి బ్యాక్టీరియల్ ఇంఫెక్షన్స్ వచ్చి, స్కిన్ క్యాన్సర్ బారిన ప్రమాదం ఉందట.

ఇప్పుడు వేస్తన్న టాటూల్లో ఆర్గానిక్ కలర్స్, కలర్డ్ ఇంక్ వాడుతున్నారు.ఇవి ఇంజెక్ట్ చేయడం వలన ఆజో-పిగ్మెంట్స్ చర్మలోకి చేరుతాయి.ఇలాంటి కండిషన్లో చర్మం యూవి రేస్ ఎదుట నిలిచినప్పుడు రకరకాల చర్మ సమస్యలతో పాటు స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుందట.

ఇక ఈ టాటూలను వదిలించుకోవాలన్నా ప్రమాదమే అంట.లేజర్ థెరపి ద్వారా టాటూ వదిలించుకోవాలని ప్రయత్నిస్తే స్కిన్ పిగ్మెంటేషన్ డిజార్డర్స్ వచ్చే ప్రమాదం 15% పెరిగిపోతుందని చెబుతున్నార పరిశోధకులు.కాబట్టి టాటూలు వేయించుకునే ముందు కాస్త ముందు వెనుక అలోచించాల్సిందే.

టాటూ ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు అందులో ఎలాంటి రసాయనాలను వాడుతున్నారో తెలుసుకోవాలి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube