స్పెషల్ సాంగ్స్ కు సై అంటున్న టాలీవుడ్ బ్యూటీలు.. ఆఫర్లతో జాతకం మారుతుందా?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.ఈ సామెత సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకు బాగా సూట్ అవుతుందని చెప్పాలి.

 Tollywood Actresses Acting Item Songs, Tollywood, Heroines, Item Songs, Pooja He-TeluguStop.com

ఎందుకంటే ఆఫర్లు వచ్చినప్పుడే చేసుకుంటూ పోవడంతో పాటు అంత ఇంతే సంపాదించుకోవాలి.క్రేజ్‌ ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేసి, అటు ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు ఇటు బ్యాంక్‌ బ్యాలెన్స్‌ లు పెంచుకోవాలి.

ఇకపోతే ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో వెలుగొందడం కోసం ఐటెం సాంగ్స్ కి కూడా సై అంటున్నారు.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రత్యేక పాటల్లో నటించే వారికి పారితోషికం కూడా భారీగా ఇస్తుండటంతో స్పెషల్‌ సాంగ్స్‌ లో చేసేందుకు హీరోయిన్లు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.ప్రస్తుతం పూజా హెగ్డే, శ్రియ, నేహా శెట్టి, కేతికా శర్మ, రెబా మోనికా జాన్, చంద్రికా రవి వంటి హీరోయిన్లు స్పెషల్‌ సాంగ్స్‌ లో నటిస్తున్నారు.

శ్రియా శరణ్‌( Shriya Saran ).ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం హీరోయిన్‌ గా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్, స్పెషల్‌ సాంగ్స్‌పై దృష్టి పెట్టారు శ్రియ.అయితే ప్రత్యేక పాటల్లో చేయడం ఆమెకు కొత్త కాదు.రామ్‌ ని హీరోగా, ఇలియానాని హీరోయిన్‌ గా పరిచయం చేస్తూ వైవీఎస్‌ చౌదరి తెరకెక్కించిన దేవదాసు సినిమాలో తొలిసారి ప్రత్యేక పాటలో చిందేశారు శ్రియ.ఆ తర్వాత మున్నా, తులసి,పులి, నక్షత్రం లాంటి సినిమాల లోని ఐటమ్ సాంగ్స్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది.

అయితే శ్రియ తాజాగా రెట్రో సినిమాలో( retro movie ) ప్రత్యేక పాటలో సందడి చేయబోతోందట.

Telugu Item, Ketika Sharma, Pooja Hegde, Shriya Saran, Tollywood-Movie

మరొక హీరోయిన్ పూజ హెగ్డే( Pooja Hegde ).తెలుగులో తక్కువ సమయంలో నేను చాలామంది హీరోల సరసన నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజా.ప్రస్తుతం తమిళ తెలుగు హిందీ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

అయితే ప్రస్తుతం ఒకవైపు హీరోయిన్ గా బిజీ బిజీగా ఉన్న పూజ హెగ్డే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో ఒక ప్రత్యేక పాటలు చిందులు వేయబోతోందట.అయితే గతంలో పూజ హెగ్డే రంగస్థలం, ఎఫ్ 3 సినిమాలలో ఐటెం సాంగ్స్ లో చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఐటమ్ సాంగ్ చేయబోతోంది.

Telugu Item, Ketika Sharma, Pooja Hegde, Shriya Saran, Tollywood-Movie

కేతికా శర్మ( Ketika Sharma ) గురించి కూడా మనందరికీ తెలిసిందే.నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది కేతికా శర్మ.ఈ సినిమాలో అదిదా సర్ప్రైజ్ అంటూ సాగే పాటలో కేతికా శర్మ చిందులు వేసినట్టు తెలుస్తోంది.

మరొక హీరోయిన్ రెబా మోనికా జాన్.ఒకవైపు హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ మ్యాడ్ స్క్వేర్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేసిన విషయం తెలిసిందే.

ఒకవైపు హీరోయిన్ గా అలరిస్తూనే మరొకవైపు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.కేవలం వీరు మాత్రమే కాకుండా ఇంకా చాలామంది హీరోయిన్లు ఐటమ్ సాంగ్లకు కూడా సై అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube