చలికాలం( winter ) వచ్చేసింది.ఈ సీజన్ లో గుండెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఎందుకంటే మిగిలిన సీజన్లతో పోలిస్తే చలికాలంలోనే గుండు పోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఎందుకంటే చలికి ప్రతిస్పందనగా రక్త నాళాలు కుచించుకుపోతాయి.
దీని వల్ల గుండెపై అధిక ఒత్తిడి పడుతుంది.దీంతో గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదం భారీగా పెరుగుతుంది.
అందుకే గుండె ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.చలికాలంలో గుండెపోటుకు దూరంగా ఉండాలంటే కచ్చితంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చలికాలంలో చాలా మంది వ్యాయామాలను నిర్లక్ష్యం చేస్తుంటారు.
కానీ మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలను అస్సలు స్కిప్ చేయవద్దు.రోజుకు అరగంట అయినా వ్యాయామం, యోగా వంటివి చేయండి.
చల్లని ఉష్ణోగ్రతలు( Cooler temperatures ) మీ హృదయాన్ని ఇబ్బంది పెట్టవచ్చు.కాబట్టి వెచ్చగా ఉండేలా దుస్తులు ధరించండి.
మంచు ఎక్కువగా పడుతున్న సమయంలో బయట తిరక్కపోవడం ఎంతో ఉత్తమం.

అలాగే బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోండి.చలికాలంలో చాలా మంది వాటర్ తాగడం మానేస్తుంటారు.అలా అస్సలు చేయకండి.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మీ బాడీకి అవసరమయ్యే వాటర్ ను అందించాలి.డైట్ లో తాజా కూరగాయలు, ఆకుకూరలు, సీజనల్ పండ్లు, చేపలు, కోడిగుడ్లు, నట్స్( Greens, seasonal fruits, fish, eggs, nuts ) వంటివి తీసుకోండి.
ఇవి మీ గుండె పనితీరును పెంచుతాయి.గుండెపోటు వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.

అలాగే చలికాలంలో గుండెపోటుకు దూరంగా ఉండాలనుకుంటే ధూమపానం అలవాటును మానుకోండి.ఆల్కహాల్ మరియు కెఫిన్ వినియోగం వీలైనంతవరకు తగ్గించుకోండి.అలాగే ఒత్తిడి ఎంతటి మనిషినైనా చిత్తు చేస్తుంది.కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండండి.ఫుడ్ ను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం గా తీసుకోండి.రోజుకు ఒక హెర్బల్ టీ డైట్ లో ఉండేలా చూసుకోండి.
మరియు రక్త పోటును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ దానికి అనుగుణంగా నడుచుకోండి.తద్వారా ఈ చలికాలంలో హృదోగ సమస్యలకు దూరంగా ఉండొవచ్చు.







