పవన్ కల్యాణ్ అనగానే.ఆయన బిరుదు పవర్ స్టార్ ముందుగా గుర్తొస్తుంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే యువతలోఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది.అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేదు.
అందరూ పవర్ స్టార్ మేనియాలో కొట్టుకుపోతారు.సినిమాలకు సంబంధించి హిట్టు.
ఫట్టు అనే సంబంధం లేకుండా జనాల మనుసుల్లో నిలిచిన స్టార్ పవర్ స్టార్.అయితే తాజాగా పవన్ కల్యాణ్ ఈ పవర్ స్టార్ అనే మాటను వాడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా కనిపిస్తున్న పరిణామాలు ఇందకు బలాన్ని చేకూరుస్తున్నాయి.ఇంతకీ ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తాజాగా పవన్ కల్యాణ్ పుట్టిన రోజు జరిగింది.ఈ సందర్భాలు పవన్ కల్యాణ్ కు సంబంధించి పలు పోస్టర్లు రిలీజ్ అయ్యాయి.అందులో ఎక్కడ కూడా పవర్ స్టార్ అనే మాట కనిపించకపోవడం విశేషం.పార్టీ వర్గాలు కానీ.
సినిమా వర్గాలు కానీ.ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఏ పోస్టర్ మీద కూడా పవర్ స్టార్ అని రాయలేదు.
కావాలనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు.సినిమా ప్రముఖులు కూడా ఆయనకు విషెస్ చెప్తూ లీడర్.
లేదంటే జనసేనాని అనే మాటలను మాత్రమే వాడారు.పవర్ స్టార్ అనే మాటను ఎక్కా ప్రస్తావించలేదు.
రాజకీయాలకు, సినిమాలకు ఈక్వల్ గా ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
ఇంతకీ పవన్ కల్యాణ్ పవర్ స్టార్ ఎప్పుడయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం.పవన్ కెరీర్ లో బెస్ట్ హిట్ మూవీ గోకులంలో సీత.ఈ సినిమాకు మాటలు రాసింది పోసాని కృష్ణ మురళీ.
ఈ సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తొలిసారి పవన్ కల్యాణ్ ను పవర్ స్టార్ అని సంబోధించాడు.అప్పటి నుంచి వపన్ కల్యాణ్ ముందు పవర్ స్టార్ అని వాడటం మొదలయ్యింది.
ఆ తర్వాత వచ్చిన సుస్వాగతం సినిమాలో పవన్ కల్యాణ్ కు ముందు వపర్ స్టార్ అనే బిరుదు వేశారు.ప్రస్తుతం పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ అనే సినిమా చేస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్ విడుదలై.టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.