నందమూరి కళ్యాణ్ రామ్… ఈ హీరో గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలానికి పైగా హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఇప్పటివరకూ ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కళ్యాణ్రామ్ మంచి విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఇప్పుడు ప్రతిష్ఠాత్మకమైన బింబిసార అనే సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.అయితే సోషియో ఫాంటసీ మూవీ గానే ఈ సినిమా ఉండబోతుంది అనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.
ఇకపోతే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది.ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత బింబిసార బాహుబలి లెవల్లో ఉండబోతుంది అని అటు నందమూరి అభిమానులు అందరూ కూడా భావిస్తున్నారు.ఎంతమంచి వాడవురా లాంటి సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని బింబిసార తో ప్రేక్షకులను అలరించబోతున్నారు నందమూరి కళ్యాణ్ రామ్.
ఇటీవలే విడుదలైన ట్రైలర్ లో అటు కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగులు మాత్రం నందమూరి అభిమానులు అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉన్నాయి అని చెప్పాలి.పట్టుమని వందమంది అయిన లేరు… యుద్ధం వస్తే ఎలా ఉంటుందో చూస్తారు.
రాక్షసులు ఎరుగని రావణ రూపం అంటూ వచ్చే డైలాగులు మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి.
ఒకసారి ట్రైలర్ చూసిన ట్రైలర్ చూసిన అభిమానులు మళ్ళీ రిపీట్ చేసుకుంటూ డైలాగులు వింటూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే.దీంతో ఈ పవర్ ఫుల్ డైలాగ్స్ రాసిన ఇంత మంచి డైలాగ్ రైటర్ ఎవరు అని వెతకడం ప్రారంభించారు.ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే.
బింబిసార సినిమాకి డైలాగ్స్ రాసిన రచయిత పేరు వాసుదేవ్ మునెప్పగారి. అయితే ఇతను ఇప్పటివరకు ఏ సినిమాకి డైలాగ్స్ రాయలేదట.
కానీ పాటలు రాసిన అనుభవం మాత్రం అతనికి ఉందట.ఇక 28 ఏళ్ల ఆ యువకుడు మొదటిసారి బింబిసారా సినిమా కి అదిరిపోయే డైలాగులు అందించాడు.
అంతేకాదు ఇక పార్టీభారీ ప్రాజెక్టు కోసం యువ టాలెంట్ పైన నమ్మకం పెట్టుకుని అతని ప్రోత్సహించిన కళ్యాణ్ రామ్ పై కూడా ప్రస్తుతం అభిమానుల ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.