చాలా మంది అమ్మాయిలు బ్యూటీపార్లర్ లో నెలకు ఒకట్రెండు సార్లు అయినా పెడిక్యూర్( Pedicure ) చేయించుకుంటూ ఉంటారు.పెడిక్యూర్ అనేది కేవలం అందంగా కనిపించడం కోసమే కాదు.
పాదాలు ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.పెడిక్యూర్ తో పాదాలపై చేరిన దుమ్ము, ధూళి, బాక్టీరియా తొలగిపోతాయి.
గోర్లు ఆరోగ్యంగా పెరుగుతాయి.పాదాలపై చనిపోయిన చర్మ కణాలు రిమూవ్ అవుతాయి.
పాదాల ఇన్ఫెక్షన్లు వచ్చే రిస్క్ తగ్గుతుంది.అలాగే పెడిక్యూర్ వల్ల రక్తప్రసరణ మెరుగుపడి కాళ్లలో ఒత్తిడి తగ్గుతుంది.
రిలాక్స్ అయిన ఫీలింగ్ లభిస్తుంది.పాదాలు పొడిబారకుండా, మృదువుగా ఉంటాయి.అయితే బ్యూటీపార్లర్స్ లో పెడిక్యూర్ చేయడానికి రూ.400 నుంచి రూ.1000 వరకు ఛార్జ్ చేస్తుంటారు.కానీ, కొంచెం శ్రమ పెడితే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు.
అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టెప్ 1: పెడిక్యూర్ లో భాగంగా ముందు పాదాలను నానబెట్టాలి.ఓ పెద్ద గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకొని, అందులో కొంచెం షాంపూ,( shampoo ) ఎప్సమ్ సాల్ట్ లేదా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం( lemon juice ) వేసి కలపండి.ఈ వాటర్ లో పాదాలను పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టండి.
తద్వారా పాదాలపై డెడ్ స్కిన్ తొలగించడానికి సులభం అవుతుంది.
స్టెప్ 2: డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించాలి.అందుకోసం ప్యూమిస్ స్టోన్ లేదా ఫుట్ స్క్రబ్బర్ ను ఉపయోగించి మొత్తం పాదాలను సాఫ్ట్‌గా స్క్రబ్ చేయండి.ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోండి.

స్టెప్ 3: నెయిల్స్ ను కట్ చేసి షేప్ చేయాలి. గోర్లు సమంగా కత్తిరించి, నెయిల్ ఫైలర్‌తో ఆకారం అందంగా చేయాలి.ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా కడిగి క్లాత్ తో తుడుచుకోవాలి.

స్టెప్ 4: పాదాలను మాయిశ్చరైజ్ చేయడం.పెడిక్యూర్ సమయంలో కనీసం ఐదు నిమిషాలు అయినా నూనె లేదా ఫుట్ క్రీమ్‌తో పాదాలను మసాజ్ చేయాలి.మసాజ్ కు ఆవ నూనె, నువ్వుల నూనె, బాదం నూనెను ఉపయోగించవచ్చు.
మసాజ్ వల్ల రక్త ప్రసరణ పెరుగుపడి పాదాలు ఆరోగ్యంగా మారతాయి.
స్టెప్ 5: నెయిల్ పాలిష్ వేసుకోవడం, నెయిల్స్ బేస్ కోట్ అప్లై చేసి, మీకు నచ్చిన కలర్‌లో నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు.మరియు గోళ్ళు చుట్టూ ఉండే క్యూటికల్స్ కు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.తద్వారా క్యూటికల్స్ మృదువుగా మారతాయి.