దురద ఒక వ్యాధి అని అంటారు.ఇది వృద్ధులకు కొంచెం ఎక్కువ.
రాజులకు, చక్రవర్తులకు కూడా చాలా ఎక్కువేనట.దురద వచ్చి, అక్కడ గోక్కున్నప్పుడు ఎంతో హాయి కలుగుతోంది.
ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా జరగవచ్చు.బస్సులో, రైలులో, ఇంట్లో, ఆఫీసులో ఇలా ఎక్కడైనా సరే మీరు దురదను తప్పించుకోలేరు.
దురద అనేది ఒక్కోసారి శరీరంపై గీతలు పడేవరకూ వదలదు.దురద అనేది మానవ నాగరికత చరిత్ర అంతటి పురాతనమైనది.
దురదను తొలగించేందుకు రకరకాల సువాసనగల క్రీములు, ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తూనే ఉంటాయి.టీవీ నుండి ఇంటర్నెట్ వరకు, దాని ప్రకటనల ప్రవాహం కొనసాగుతుంటుంది.
లివర్‌పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ మెక్‌లోన్ మాట్లాడుతూ ఒక వ్యక్తి సాధారణంగా రోజుకు 97 సార్లు దురదను అనుభవిస్తాడుట.కీటకాలు, చెట్లు, మొక్కలు మానవ చర్మంపై విషాన్ని విడుదల చేస్తాయి.
దీనికి ప్రతిస్పందనగా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ హిస్టామిన్‌ను స్రవిస్తుంది.హిస్టామిన్ మెదడుకు దురద యొక్క సంకేతాన్ని ఇస్తుంది.
అప్పుడు మనం గోక్కోవడం ప్రారంభిస్తాం.అమెరికన్ శాస్త్రవేత్త జేఆర్ ట్రెవర్ దురద కథను ప్రస్తావిస్తుంటారు.
అతని 40వ పుట్టినరోజున, ట్రెవర్ తన శరీరంపై తీవ్రమైన దురదను ఎదుర్కొన్నాడు.దురద గురించి ఆందోళన చెందాడు.

దీంతో అతను దురదకు గల కారణం, చికిత్సను కనుగొనడంలో తదుపరి 40 సంవత్సరాలు గడిపాడు.దాని ఫలితాలు ప్రముఖ పెద్ద శాస్త్రవేత్తలకు పంపాడు.దీనిపై పరిశోధనా పత్రం కూడా రాశారు.1948లో అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్శిటీ దీనిపై ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించింది.అందులో జార్జ్ బిషప్ అనే వైద్యుడు దురద వచ్చినప్పుడు తాను గట్టిగా గోక్కుని తనను తాను బాధించుకుంటానని రాశాడు.వాస్తవానికి దురద వచ్చిన చోట గోక్కోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.
మీకు దురద వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ వీపును గోకినప్పుడు మీరు మంచి అనుభూతికి లోనవుతారు.