ప్రపంచ దేశాలతెజో పోలిస్తే జపాన్( Japan ) యువత పూర్తి భిన్నంగా ఉంటుంది.ముఖ్యంగా పని ఒత్తిడి, ఆర్థిక అస్థిరత వంటి కారణాలతో పెళ్లి, శృంగారంపై ఆసక్తి చూపించటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి.
కొంతమంది యువత శృంగారంపై ఆసక్తి ఉన్నా సరైన సమయం లేకపోవడం వల్ల దూరంగా ఉంటున్నారని పరిశోధనలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది.
పెళ్లైన దంపతులు( Married Couples ) శృంగారంలో పాల్గొనేందుకు వీలుగా వారానికి 36 గంటల ప్రత్యేక సెలవులను అందించాలనే ప్రణాళిక రూపొందించింది.అంతేకాకుండా, పిల్లలను కనేందుకు మరింత ప్రోత్సాహకాలు కూడా అందించనున్నట్లు సమాచారం.
జపాన్‌లో సమాజ నిర్మాణంలో వచ్చిన మార్పులు, ప్రాధాన్యతల మార్పు, జీవిత శైలి తీరుబాట్ల కారణంగా జననాల రేటు భారీగా తగ్గిపోతోంది.ముఖ్యంగా యువత పెళ్లికి ఆసక్తి చూపించకపోవడం, తల్లిదండ్రులయ్యేందుకు భయపడటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం దేశ జనాభాను( Population ) నిలబెట్టేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.ప్రస్తుతం జపాన్‌లో వారానికి ఐదు రోజుల పని నడుస్తోంది.అయితే, ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం వారానికి నాలుగు రోజుల పని ఉండి మిగిలిన 36 గంటలు విశ్రాంతిగా, ప్రైవసీ కోసం కేటాయించనుంది.ఈ విధానం వల్ల దంపతులకు తగినంత సమయం లభిస్తుందని, వారి వైవాహిక జీవితం మెరుగుపడుతుందని, తద్వారా జనాభా పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

జపాన్ దేశం గత కొన్ని దశాబ్దాలుగా తగ్గుతున్న జనాభా రేటుతో పోరాడుతోంది.కొన్ని అధ్యయనాల ప్రకారం ఇప్పటికే దేశంలో 9 మిలియన్ల ఇళ్లు ఖాళీగా ఉన్నట్లు తేలింది.పెరుగుతున్న వృద్ధాప్య రేటు, జననాల తగ్గుదల దేశ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.ప్రభుత్వం ఇప్పటికే వివాహితుల కోసం వివిధ ప్రోత్సాహకాలను అందిస్తోంది.తల్లిదండ్రులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, పిల్లల సంరక్షణ కోసం సబ్సిడీలు, వివాహ ప్రోత్సాహకాల వంటి పథకాలు అమలులో ఉన్నాయి.అయితే, అవి సరిపోదని భావించి, ఇప్పుడు శృంగారం కోసం ప్రత్యేకంగా సెలవులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది.

జపాన్ ప్రపంచంలోని అత్యల్ప జనన రేటు కలిగిన దేశాలలో ఒకటిగా మారింది.దీనిని ఎదుర్కొనేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, యువత పెళ్లి, పిల్లలు పెంచే విషయంలో ఆసక్తి చూపించకపోవడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా యువతకు పెళ్లి, కుటుంబ జీవితం పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.జపాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం దేశ జనాభా సమస్యను పరిష్కరించడంలో ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.