పేకాట మత్తులో నటుడు.... రాజీవ్ కనకాల వద్ద రూ.350 కోట్లు అప్పు చేశారా?

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల అలవాట్లు ఉంటాయి.అయితే కొంతమందికి పేకాట ఆడటం కూడా ఒక వ్యసనంలో మారిపోయి ఉంటుంది.

 Actor Harsha Vardhan Sensational Comments On Poker , Harsha Vardhan, Rajeev Kana-TeluguStop.com

ఇలా ఈ ఆటను వ్యసనంగా మార్చుకొని నటుడు హర్షవర్ధన్ (Harsha Vardhan)మరొక నటుడు రాజీవ్ కనకాల(Rajeev Kanakala) వద్ద వందల కోట్లు అప్పు చేశారని తెలుస్తోంది.అయితే ఈ విషయాన్ని స్వయంగా నటుడు హర్షవర్ధన్ బయట పెట్టడం విశేషం.

ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ పాల్గొన్న సంగతి తెలిసిందే.ఈయనకు యాంకర్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

గతంలో మీరు తిండి నిద్రాహారాలు మానేసి రెండు రోజులపాటు ఆ పని చేశారట కదా అది నిజమేనా అని యాంకర్ అడిగారు.

యాంకర్ అడిగిన ప్రశ్నకు హర్షవర్ధన్ సమాధానం చెబుతూ…విషయం ఒక రాజీవ్ కనకాలకు తప్ప ఎవరికీ తెలియదు.

అలాంటిది రాజీవ్ కనకాల బయట పెట్టారంటే ఆయన్ని ఇరికించేలా నేను కూడా మరో విషయం బయట పెట్టాలనీ తెలిపారు.మా ఇద్దరికి సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న సమయంలో పేకాటకు అలవాటు పడ్డము.

ఆ అలవాటు మాకు ఒక వ్యసనంగా మారిపోయింది.రాత్రి 8 గంటలకు ఆట మొదలు పెడితే తెల్లవారులు అలాగే కూర్చుని ఆట ఆడేవాళ్ళం.

Telugu Crore, Harsha Vardhan, Poker, Rajeev Kanakala-Movie

మేమిలా సమయం తెలియకుండా పేకాట (Poker) ఆడటం చూసి ఎంతోమంది మా స్నేహితులు షాక్ అయిపోయారు.ఆ టైంలో 5 పైసలతో మేం పేకాట ఆడడం స్టార్ట్ చేసాం.కానీ చివరికి అది కోట్ల వరకు వెళ్ళింది.అలా ఆడిఆడి నేను లాస్ అయ్యి రాజీవ్ కనకాల దగ్గర 350 కోట్ల (350 Crore)రూపాయల అప్పు తీసుకున్నాను అంటూ హర్షవర్ధన్ తెలిపారు.

ఇలా పేకాట ఆడటం కోసం ఈయన 350 కోట్లు అప్పు చేశానని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.ఈయన మాటలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈయనకు 350 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చే అంత డబ్బు రాజీవ్ కనకాల సంపాదించారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Crore, Harsha Vardhan, Poker, Rajeev Kanakala-Movie

ఒకవేళ సంపాదించిన కూడా పేకాట ఆడటం కోసం స్నేహితుడికి ఇంత మొత్తంలో అప్పుగా ఇస్తారా అంటూ అందరూ షాక్ అవుతున్నారు.అయితే హర్షవర్ధన్ రాజీవ్ కనకాలను ఇరికించడం కోసం అలా ఒక ఫన్నీ విషయాన్నీ బయట పెట్టారు కావచ్చు అని ఇంకొంతమంది అనుకుంటున్నారు.ఏది ఏమైనప్పటికీ హర్షవర్ధన్ చెప్పిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube