చికెన్ పేరు వింటే చాలు చాలా మందికి నోట్లో నీళ్లూరుతుంటాయి. నాన్ వెజ్ లవర్స్ (Non-veg lovers)లో ఎక్కువ శాతం మంది చికెన్ ను ఇష్టంగా తింటుంటారు.
అయితే ఆరోగ్యపరంగా చికెన్ మంచిది కాదని కొందరు భావిస్తుంటారు.ఇంకొందరు చికెన్ హెల్తీ ఫుడ్ అని చెబుతారు.
అసలు చికెన్(Chicken) ఆరోగ్యకరమా? కాదా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.వాస్తవంగా చెప్పాలంటే చికెన్ ఆరోగ్యకరమే.
కానీ చికెన్ ను వండే విధానం, ప్రాసెసింగ్ మరియు తినే పరిమాణం మీద దాని ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి.
చికెన్ లో ప్రోటీన్ అధిక మొత్తంలో ఉంటుంది.
ఇది కండరాల అభివృద్ధికి మరియు శరీర బలానికి సహాయపడుతుంది.చికెన్ లో ఉండే విటమిన్ బి6, విటమిన్ బి12, జింక్, ఫాస్పరస్, సెలెనియం లాంటి పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో హెల్ప్ చేస్తాయి.
చికెన్‌లో లభించే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు, పొటాషియం(Omega-6 fatty acids, potassium) గుండెకు మేలు చేస్తాయి.తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్ కలిగి ఉండటం వల్ల, బరువు తగ్గించే డైట్‌లో చికెన్ మంచి ఎంపిక అవుతుంది.

అయితే చికెన్ ను డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎక్కువ నూనె, ట్రాన్స్ ఫ్యాట్స్(Oil, trans fats) చేరి గుండెకు హానికరంగా మారతాయి.అలాగే ప్రాసెస్డ్ చికెన్ కు ఎంత దూరంగా ఉండే అంత ఉత్తమం.సాస్, ఫ్లేవర్ యాడ్ చేసిన ప్రాసెస్డ్ చికెన్ ఆరోగ్యానికి చేసే మేలు కన్నా నష్టమే ఎక్కువ.కొందరు చికెన్ ను చాలా అధిక పరిమాణంలో తీసుకుంటారు.ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది.మరియు రక్తపోటు కూడా అదుపు తప్పుతుంది.
ఇక సరిగ్గా ఉడకని చికెన్ కూడా తినరాదు.అలా చేస్తే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే రిస్క్ ఉంది.

ఆరోగ్యానికి ప్రధాన్యత ఇవ్వాలనుకుంటే ఫ్రెష్ చికెన్ ను ఎంచుకోండి.డీప్ ఫ్రై కాకుండా గ్రిల్, బాయిల్, స్టీమ్ చేసి తినండి.అలాగే చికెన్ ను వండే సమయంలో ఉప్పు, మసాలాలను చాలా వరకు తగ్గించండి.మరియు తక్కువ పరిణామంలో తినండి.చికెన్ ను మితంగా, ఆరోగ్యకరంగా వండుకుని తింటే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.







