ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ టీ అత్యధికంగా సేవించే పానియాల్లో ఒకటి అనడంలో సందేహం లేదు.ముఖ్యంగా ఇటీవల కాలంలోనే గ్రీన్ టీ వాడకం బాగా పెరిగిపోయింది.
వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నించే వారు, ఆరోగ్యాన్ని కాపాడాలనుకునే వారు ఖచ్చితంగా డైట్‌లో గ్రీన్ టీని చేర్చుకుంటారు.అయితే గ్రీన్ టీ ఆరోగ్య పరంగానే కాకుండా.
సౌందర్య పరంగానూ ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా గ్రీన్ టీలో కొన్ని ఇన్‌గ్రీడియన్స్ కలిపి ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే.
ముఖం యవ్వనంగా మరియు కాంతివంతంగా మెరిసిపోతుంది.
ముందుగా గ్రీన్ టీని తయారు చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు గ్రీన్ టీలో శెనగపిండి, కొద్దిగా నిమ్మ రసం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుని.
ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.అనంతరం కూల్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే.ముఖంపై డెడ్ స్కిన్ సెల్స్ పోయి.
కాంతివంతంగా మారుతుంది.
అలాగే గ్రీన్ టీ వాటర్‌లో బాగా పండిన బొప్పాయి గుజ్జు మరియు తేనె వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి.అర గంట పాటు వదిలేయాలి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే.
ముఖంపై డార్క్ స్పాట్స్ దూరం అవ్వడంతో పాటు చర్మం తెల్లగా, అందంగా మారుతుంది.

ఇక కళ్ల చుట్టు నల్లటి వలయాలు ఉన్న వారికి కూడా గ్రీన్ టీ అద్భుతంగా సహాయపడుతుంది.గ్రీన్ టీ పౌడర్‌లో కొద్దిగా బాదం ఆయిల్ మిక్స్ చేసి.కళ్ల చుట్టు అప్లై చేయాలి.
పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తే.
నల్లటి వలయాలు దూరం అవ్వడంతో పాటు కళ్లు కాంతివంతంగా కూడా మారతాయి.