హైబీపీ లేదా అధిక రక్త పోటు.ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని బాధిస్తున్న సమస్య ఇది.
ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, అధిక ఒత్తిడి, ఉప్పు అధికంగా వాడటం ఇలా రకరకాల కారణాల వల్ల రక్త పోటు స్థాయిలు ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా పెరిగి పోతుంటాయి.దాంతో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే హైబీపీ సమస్యతో బాధ పడే వారు ఇప్పుడు చెప్పబోయే స్పెషల్ టీను డైట్‌లో చేర్చుకుంటే గునక.రక్త పోటు స్థాయిలను అదుపులోకి తెచ్చుకోవచ్చు.
ఇంతకీ ఆ స్పెషల్ టీ ఏంటా అనేగా మీ డౌట్ అదే లెమన్ గ్రాస్ (నిమ్మ గడ్డి) టీ.మార్కెట్స్‌లో విరి విరిగా లభించే నిమ్మ గడ్డిలో బోలెడన్ని పోషక విలువలు దాగి ఉంటాయి.అందుకే ఈ నిమ్మ గడ్డి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా నిమ్మ గడ్డితో తయారు చేసిన టీని రోజూ తీసుకుంటేనే అనేక జబ్బులను నివారించుకోవచ్చు.మరి నిమ్మ గడ్డి టీని ఎలా తయారు చేయాలి.? దాన్ని తాగడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా గిన్నెలో గ్లాస్ వాటర్‌లో పోసి.అందులో శుభ్రం చేసుకున్న నిమ్మ గడ్డి వేసి ఆరేడు నిమిషాల పాటు బాగా మరిగించాలి.అనంతరం ఫీల్టర్ చేసుకుని కొద్దిగా తేనె కలిపితే నిమ్మ గడ్డి టీ సిద్ధమైనట్టే.అధిక రక్త పోటు ఉన్న వారు ఈ నిమ్మ గడ్డి టీని రోజుకో కప్పు చప్పున తీసుకుంటే.
అందులో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు రక్త పోటు స్థాయిలను కంట్రోల్ చేయడమే కాదు, ఇకపై అదుపు తప్పకుండా కూడా రక్షిస్తుంది.

అలాగే నిమ్మ గడ్డి టీని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.మలబద్ధకం సమస్య ఉంటే పరార్ అవుతుంది.
మరియు శరీరంలో విషాలు, వ్యర్థాలు సైతం సులభంగా బయటకు వెళ్లిపోతాయి.