త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారమ్మల జాతర( Sammakka Saralamma Jatara )లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మన తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటూ ఉంది.దీనిలో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అడవి శాఖ వసతులు, వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ జాతరకు మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ పక్కన ఉన్న రాష్ట్రాల ప్రజలు కూడా వస్తారు.అలాగే మన దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రజలు ఈ జాతరకు తరలివస్తారు.
అడవి పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ( Konda Surekha) సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని మంత్రి వెల్లడించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 29వ తేదీ దాకా పర్యావరణ రుసుము వసూలు నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ వెల్లడించింది.చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈమెరకు ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో జాతరకు వచ్చే వాహనాలు, రద్దీ నియంత్రణ కూడా కొంత మేరకు సులువు అయ్యే అవకాశం ఉంది.ఇందుకోసం మూలుగు జిల్లా అడివి అధికారి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు తెలిపారు.
ఇంకా చెప్పాలంటే ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో పస్రా, తాడ్వాయి( Tadwai ), ఏటూరు నాగారంల నుంచి వచ్చే వాహనాల నుంచి నామ మాత్రపు పర్యావరణ రుసుమును ఇప్పటిదాకా అడివి శాఖ వసూలు చేస్తూ ఉంది.

ఇలా వచ్చే ఆదాయంలో అటవీ ప్రాంతాలకు రక్షణకు, ప్లాస్టిక్ తొలగించేందుకు, వన్యప్రాణుల రక్షణకు అటవీ శాఖ ఉపయోగిస్తూ ఉంది.అయితే వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తి మేరకు జాతర ముగిసేలోగా ఈ ఫీజు ఉసూలు నిలిపివేస్తున్నారు.అంతేకాకుండా జాతరకు వచ్చే భక్తులు అడవి ప్రాంతాన్ని వీలైనంత పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అటవీశాఖ భక్తుల ను కోరింది.
అదే విధంగా భక్తులు అడవిలో జాగ్రత్తగా కూడా ఉండాలని భక్తులకు అడవి శాఖ హెచ్చరించింది.