పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కలలో ఉద్రిక్తత నెలకొంది.ఆర్ అండ్ బీ స్థలంలో నెలకొల్పిన బీఆర్ అంబేద్కర్ విగ్రహం తొలగింపు విషయంలో కోర్టు ఉత్తర్వులతో వివాదం తలెత్తింది.
ఈ క్రమంలో జేసీబీతో విగ్రహాన్ని తొలగిస్తున్న సమయంలో ఇద్దరు యువకులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.దీంతో జేసీబీ అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి యువకులను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు భారీగా మోహరించారు.