యాంటి ఆక్సిడెంట్ పుష్కలంగా లభించే 7 ఆహారాలు

యాంటి ఆక్సిడెంట్ అనేవి మనకు వర ప్రదాయిని అని చెప్పవచ్చు.ఇది మనకు చాలా రకాలుగా సహాయపడుతుంది.

 Top 7 High Antioxidant Foods-TeluguStop.com

వయస్సు మీద పడకుండా కాపాడటంలో కీలకమైన పాత్రను పోషించటమే కాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.యాంటి ఆక్సిడెంట్స్ మనకు వృద్ధాప్యం దరి చేరకుండా ఆరోగ్యంగా, యౌవనంగా ఉండేలా సహాయపడుతుంది.

అలాగే యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉన్న ఆహారాలు మనకు ఎటువంటి ప్రయోజనాలను అందిస్తుందో వివరంగా తెలుసుకుందాం

రెడ్ బీన్స్

అన్ని రకాల బీన్స్ ఆరోగ్యానికి మంచివే.కానీ ముదురు రంగు బీన్స్ చాలా మంచివి.

వీటిలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ గుండె వ్యాధి మరియు క్యాన్సర్వ్యా ధుల నుండి కాపాడతాయి

బ్లూ బెర్రీస్

బ్లూ బెర్రీస్ లో ఆంథోసియానిన్ అనే సహజ ప్లాంట్ కెమికల్ సమృద్ధిగా ఉంటుంది.ఈ బెర్రీలకు వాటి రంగును బట్టి ఆ పేరు వచ్చింది.బ్లూ బెర్రీస్ దృష్టి సరిగ్గా ఉండేలా చేయుట,రక్తంలో చక్కర శాతం తక్కువ ఉండేలా చూస్తాయి.

క్రాన్బెర్రీస్

ఈ తియ్యటి టార్ట్ బెర్రీలకు ఆ రంగు వాటిలో ఉండే ఆంథోసియానిన్ల వలన వచ్చింది.ఇది వాపు తగ్గించడానికి మరియు రోగనిరోధకతను బలోపేతం చేయటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి

ఆర్టిచోక్ హార్ట్స్

పైబర్,యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉన్న ఈ విజిటేబుల్ సిద్దం చేయటం సులభం మరియు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటం మరియు గుండె వ్యాధుల మీద పోరాడే సామర్ధ్యంను కలిగి ఉంది

బ్లాక్ బెర్రీస్

శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ఈ నిగనిగలాడే చిన్న బెర్రీలు అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడం మరియు చిత్తవైకల్యం నుండి మెదడును సమర్ధవంతంగా రక్షిస్తాయి

ప్రూనే

దీనిని ఎండిన రేగు అని పిలుస్తారు.

దీనిలో శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి

రాస్ప్బెర్రీస్

రాస్ప్బెర్రీస్ చూడటానికి చిన్నగా ఉన్నా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి.గుండె వ్యాధి మరియు కొన్ని రకాల క్యాన్సర్ల మీద పోరాటం చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube