Dandruff Remedies : పైసా ఖర్చు లేకుండా చుండ్రును మాయం చేసే మ్యాజికల్ రెమెడీ.. 2 సార్లు పాటిస్తే చాలు!

ఆడ, మగ అనే తేడా లేకుండా ఎంతో మందిని సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో చుండ్రు( Dandruff ) ఒకటి.పిల్లల్లో సైతం చుండ్రు సమస్య తలెత్తుతుంటుంది.

 Try This Magical Remedy To Get Rid Of Dandruff-TeluguStop.com

వాతావరణంలో మార్పులు, ఫంగల్ ఇన్ఫెక్షన్, డ్రై స్కాల్ప్, సెబమ్ యొక్క అధిక ఉత్పత్తి, షాంపూను సరిగ్గా క్లీన్ చేయకపోవడం తదితర కారణాల వల్ల చుండ్రు సమస్య ఏర్పడుతుంది.అయితే కొందరిలో చుండ్రు త్వరగానే పోయిన కొందరిని అస్సలు వదిలిపెట్టదు.

ఎన్ని రకాల షాంపూలు వాడిన సరే ఎలాంటి ఫలితం ఉండదు.దాంతో చుండ్రును ఎలా వదిలించుకోవాలో అర్థంగాక సతమతం అయిపోతుంటారు.

కానీ వర్రీ వద్దు.పైసా ఖర్చు లేకుండా చుండ్రును మాయం చేసే మ్యాజికల్ రెమెడీ( Maggical Remedy ) ఒకటి ఉంది.

కేవలం రెండు సార్లు ఈ రెమెడీని పాటించాలంటే చాలా సులభంగా చుండ్రుకు బై బై చెప్పవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

-Telugu Health

ముందుగా ఒక కలబంద ఆకు( Aloevera ) తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక నిమ్మ పండును కూడా తీసుకొని వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు మరియు నిమ్మ పండు ముక్కలు( Lemon ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా ఒక హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.ఈ టానిక్ ను స్కాల్ప్ కు ఒకటికి రెండుసార్లు బాగా అప్లై చేసుకోవాలి.ఆపై పది నిమిషాలు మసాజ్ చేసుకోవాలి.

-Telugu Health

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హోమ్ మేడ్ టానిక్( Homemade Tonic) ను వాడారంటే చుండ్రు దెబ్బకు పరారవుతుంది.కలబంద, నిమ్మ పండు మరియు ఆవ నూనె లో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ స్కాల్ప్ హెల్త్ ను ప్రమోట్ చేస్తాయి.చుండ్రును సమర్థవంతంగా నివారిస్తాయి.

చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా కూడా ఈ రెమెడీ ద్వారా కేవలం రెండు వాషుల్లోనే పూర్తిగా తొలగిపోతుంది.కాబట్టి చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube