ప్రస్తుతకాలంలో టెక్నాలజీ( Technology ) ఏ రేంజ్ లో రోజురోజుకి మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం ప్రపంచం మొత్తంగా ఏఐ టెక్నాలజీ, రోబోటిక్స్ టెక్నాలజీ బాగా ప్రచారంలోకి వచ్చాయి.
ఇప్పటికే ఏఐ టెక్నాలజీ అనేక విషయాలలో పనిని సులభతరం చేస్తుంటే మరికొన్ని సమయాల్లో ఈ టెక్నాలజీ వల్ల కొందరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇక రోబోటిక్స్ టెక్నాలజీ( Robotics Technology ) విషయానికి వస్తే.
ఈ టెక్నాలజీ ని మనుషుల జీవితాల్లోకి అతి చేరువకు తీసుకురావడానికి శాస్త్రవేత్తలు అనేక రకాల రోబో యంత్రాలను తయారు చేస్తున్నారు.ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ మనిషి రెండు రోబోలతో ఫుట్ బాల్ ఆడుతున్నాడు.

ఈ వీడియోలో అచ్చం ఫుట్ బాల్ బంతి( Football )ని మనిషి ఎలా కాలితో కొడుతున్నాడో అచ్చం అలాగే రోబోట్స్ కూడా ఆడుతున్నాయి.అయితే ఈ వీడియో చూసిన నెటిజెన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ( AI Technology )తో తయారు చేసిందని., ఇది పూర్తిగా డీప్ ఫేక్ సంబంధించిన వీడియో అంటూ వారు అభిప్రాయపడుతున్నారు.
ఇలా రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఎలాంటి సమస్యలకు దారితీస్తుందో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఇలాంటి టెక్నాలజీ కలిగిన రోబోలను తయారు చేస్తే ముందు ముందు మనిషి మనుగడకే పెద్ద ఎత్తున ప్రమాదం వాటిల్లుతుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.ఒకవైపు ఇలా ఉన్న మరోవైపు వైద్యరంగంలో రోబోటిక్స్ ను ఉపయోగించుకొని పెద్దపెద్ద సర్జరీలను కాస్త డాక్టర్లు సునాశంగా పూర్తి చేయగలుగుతున్నారు.చూడాలి మరి ముందు ముందు రోజులలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ( Artifical Intelligence ), రోబోటిక్స్ టెక్నాలజీ మనుషుల జీవన విధానం పై ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో.







