ఒకప్పుడున్న సినిమా రంగానికి.ఇప్పటి సినిమా రంగానికి చాలా తేడా ఉంది.
ఒక్క ముక్కలో చెప్పాంటే గతంలో సినిమాలకు, ఇప్పటి సినిమాలకు అస్సలు పోలికే లేదు.ఒకప్పుడు సినిమాలు వందల రోజులు ఆడేవి.
ప్రస్తుతం 20 రోజులు ఆడితే సూపర్ హిట్, బంఫర్ హిట్ అంటూ సినిమా ప్రమోషన్ టీంలు ఊదరగొడతాయి.అంతేకాదు.
సినిమా ప్రమోషనల్ వీడియోస్ కు వచ్చే వ్యూస్ తోనే సినిమా బిజినెస్ ను అంచనా వేస్తున్నారు.సినిమా ట్రైలర్స్ కు గంట గంటకు వ్యూస్ పెరిగిపోవడం.సినిమా పట్ల ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా భావిస్తున్నారు.24 గంటల్లో ఇన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయని చెప్తూ ప్రచారం చేసుకుంటున్నారు.టాలీవుడ్ ప్రస్తుతం ఈ ట్రెండ్ బాగా కొనసాగుతోంది.ఆయా హీరోల అభిమానుల సైతం సినిమా ట్రైలర్స్ కు వచ్చిన వ్యూస్ ను బట్టి.ఓ రేంజిలీ ఫీలవుతున్నారు.మస్త్ హంగామా చేస్తున్నారు.
అయితే ఈ యూట్యూబ్ వ్యూస్ వెనుక పెద్ద గోల్ మాల్ వ్యవహారం ఉందనే టాక్ నడుస్తోంది.
తెలుగు సినిమాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సినిమా బాహుబలి.
ఈ సినిమా తెలుగు ట్రైలర్ కు కొన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి.నిజానికి ఈ సినిమాను థియేటర్లలో చూసిన వారి సంఖ్య సుమారు రెండు కోట్లు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ అందుబాటులో ఉన్నవారు 4 కోట్ల మంది ఉంటారు.దీన్ని బట్టి చూస్తే 10 కోట్ల వరకు వ్యూస్ వచ్చి ఉండాలి.
కానీ కొన్ని మిలియన్లు దాటాయి.అంతేకాదు.
తెలుగులో విడుదల అయ్యే చాలా సినిమాల ట్రైలర్స్ వ్యూస్ కూడా మిలియన్లలో వస్తున్నాయి.అయితే చిన్న చిన్న హీరోల ట్రైలర్స్ వ్యూస్ మాత్రం కనీసం సగం కూడా రావట్లేదు.
ఈ యూట్యూబ్ వ్యూస్ వెనుక పెద్ద కథ ఉందనే టాక్ నడుస్తుంది.పెద్ద హీరోలు తమ తమ ట్రైలర్స్ కు వ్యూస్ కొనుక్కుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసే వీడియోల వ్యూస్ కోసం సినిమా నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తంది.ప్రస్తుతం ఈ ట్రెండ్ దేశ వ్యాప్తంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ వెనక పెద్ద తతంగం నడుస్తుందనే టాక్ మరింత బలపడుతోంది.