చలికాలంలో చర్మం పొడిగా మారి పగులుతుంది.అంతేకాక చర్మం తెల్లగా మారిపోతుంది.
దీనితో చర్మ సంరక్షణకు ఏమి చేయాలా అని ఆలోచనలో పడటం సహజమే.ఇప్పుడు చెపుతున్న ఈ టిప్స్ ఫాలో అయితే చలికాలం ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
అంతేకాకుండా చర్మం కాంతివంతంగా మరియు మృదువుగా మారుతుంది.మరి ఆ టిప్స్ ఏమిటో తెలుసుకుందాం.
1.సాధారణంగా చలికాలంలో బాగా వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు.ఆలా చేయకూడదు.గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయటం వలన చర్మంలో సహజసిద్ధంగా ఉన్న నూనెలు పోతాయి.దాంతో చర్మం పొడిగా మారుతుంది.అందువల్ల గోరువెచ్చని నీటిలో కొంచెం కొబ్బరినూనె వేసి స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
2.స్నానం చేసిన వెంటనే చర్మానికి ఆలివ్ ఆయిల్ రాస్తే చర్మం పొడిదనం తగ్గి మృదువుగా మారుతుంది.
3.చలికాలంలో చర్మంపై మృతకణాలు ఎక్కువగా ఉంటాయి.అందువల్ల వారంలో రెండు సార్లు పేస్ వాష్ ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మృతకణాలుతొలగిపోతాయి.
4.రాత్రి పడుకొనే ముందు ముఖానికి ఏదైనా ఆయిల్ లేదా క్రీమ్ రాస్తే మరుసటి రోజు ఉదయం పొడిగా లేకుండా తేమగా ఉంటుంది.
5.ఆహారంలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్,ఉసిరి వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే చర్మ సౌందర్యం మెరుగుపడటమే కాకుండా యవన్నంగా కనిపిస్తారు.
6.ఈ కాలంలో నీటిని ఎక్కువగా త్రాగాలి.చర్మం హైడ్రేటెడ్‌గా ఉండి మృదువుగా,తేమను కోల్పోకుండా ఉంటుంది.
7.గ్లిజరిన్‌ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు ఆగాక దాన్ని రోజ్ వాటర్‌తో కడిగేయాలి.ఇలా వారంలో 3 సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.తేమ పోకుండా ఉంటుంది.
8.విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకున్నా చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది.చర్మం మృదువుగా మారుతుంది.
.