సినిమా వాళ్లెవరూ తనను పెళ్లి చేసుకునేందుకు ముందుకు రాలేదన్న జయమాలిని..

జయమాలిని.ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను ఊపుఊపిన నటీమణి.తన అందచందాలతో కుర్రకారును కైపెక్కించిన తార.సినిమాల్లో జయమాలిని పాట వస్తుందటే చాలు జనాలు థియేటర్లలో నిలబడి ఈలలు కొట్టేది.డాన్సులు వేసి సందడి చేసేది.జయమాలిని డ్యాన్స్ అంటేనే జనాలు పడి చచ్చేవారు.వ్యాంప్ ఆర్టిస్టుగా అద్భుతంగా రాణించింది ఈ ముద్దుగుమ్మ.పలు సినిమాల్లో తను హీరోయిన్ గా నటించినాస్సెషల్ సాంగ్స్ డ్యాన్సర్ గానే బాగా పాపులారిటీ సాధించింది.

 Why No One From Industry Not Married Jayamalini , Jaya Malini , About Her Marreg-TeluguStop.com

అయితే జనాలకు తెలియని విషయం ఏంటంటే బాలయ్య హీరోగా నటించిన తొలి సినిమాలో హీరోయిన్ గా జయమాలిని నటించింది.ఆ సినిమా పేరు అన్నదమ్ముల అనుబంధం.

Telugu Marrege, Anadammulu, Jaya Malini, Jayamalini, Kollywood, Tollywood-Movie

ఎంతో మందిని తన అందచందాలతో కవ్వించిన జయమాలిని సినిమా జీవితంత పోల్చితే నిజ జీవితం ఫూర్తి డిఫరెంట్ గా ఉండేది.కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఆమె తన అందాలను ప్రదర్శించేది. షాట్ అయ్యాక ఒంటినిండా దుస్తులు కప్పుకునేది.సెట్స్ లో కూడా అందరితో చాలా డీసెంట్ గా ప్రవర్తించేది.ఆమెతో ఎవరూ అసభ్యంగా ప్రవర్తించేవారు కాదు.దశాబ్దానికిపైగా ఆమె డ్యాన్సర్ గా జనాలను ఆకట్టుకున్నారు.1994లో పార్తీపన్ అనే పోలీసు అధికారిని ఆమె పెళ్లి చేసుకుంది.అనంతరం సినిమాలకు దూరం అయ్యింది.

ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.తన పిల్లలను సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు.

Telugu Marrege, Anadammulu, Jaya Malini, Jayamalini, Kollywood, Tollywood-Movie

చాలా మంది జయమాలిని ప్రేమలో పడలేదా? అనే ప్రశ్న లేవనెత్తుతూ ఉంటారు.ఆమెను ఎవరైనా ప్రేమించారా? అనే చర్చ కూడా నడుస్తుంది.అయితే జయమాలిని చాలా పద్దతిగా నడుచుకునేది.తన షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్లిపోయేది.ఎవరితోనూ అంతగా కలిసి ఉండేది కాదు.అందుకే తను ఎవరితో ప్రేమలో పడలేదు.

కొంత మంది తనను ప్రేమిస్తున్నాను అని చెప్పినా తాను యాక్సెప్ట్ చేయలేదని చెప్పింది.తాను పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు సినిమా వాళ్లు ఎవరూ ముందుకు రాలేదని చెప్పింది.

చివరకు తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన పార్తీపన్ ను పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube