ఎన్టీఆర్ నటించిన సినిమా అనురాగ దేవత.పరుచూరి బ్రదర్స్ తొలిసారి కథ అందించిన చిత్రం కూడా ఇదే.దీని తర్వాత చండశాసనుడు సినిమాకు కథ, మాటలు రాశారు.నిజానికి ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాలి.
కానీ ఆయనకు స్ర్కిప్టు నచ్చలేదు.దీంతో తాను ఈ సినిమా చేయలేనని చెప్పాడు.
దీంతో ఎన్టీఆరే స్వయంగా దర్శకత్వం వహించాడు.ఈ సినిమా అనుకున్న దానికంటే అద్భుత విజయాన్ని అందుకుంది.
అప్పట్లో ఎన్టీఆర్ కు పరుచూరి వెంకటేశ్వరరావు పరిచయం అయ్యాడు.ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో మా తమ్ముడు గోపాలక్రిష్ణ ఉయ్యూరులో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు.
తనకు మీరంటే ప్రాణం అని చెప్పాడు.అంతేకాదు.
తన సినిమాలను చూస్తే అభిమానంతో ఊగిపోతాడని చెప్పాడు.అతడి దగ్గర చండశాసనుడు అనే సినిమా కథ ఉందని చెప్పాడు.
మీరు వింటానంటే పిలిపిస్తానని చెప్పాడు.
రామారావు పిలిపించమని చెప్పాడు.దీంతో గోపాల క్రిష్ణ వచ్చి ఎన్టీఆర్ కు కథ చెప్డు.కథ నచ్చితే రాఘవేంద్రరావుతో సినిమా చేయాలని రామారావు అనుకున్నాడు.
కానీ ఈ కథ ఎన్టీఆర్ కు నచ్చింది.రాఘవేంద్ర రావుకు నచ్చలేదు.
ఓ రోజు గోపాల క్రిష్ణకు ఎన్టీఆర్ కాల్ చేశాడు.మద్రాసుకు వచ్చి కలవమన్నాడు.
వెళ్లి కలిశాడు.చండశాసనుడు సినిమా గురించి మాట్లాడుదామని పిలిపించానన్నాడు.
దర్శకుడు ఎవరి అడగ్గా.తానే చేస్తానని చెప్పాడు ఎన్టీఆర్.
వెంటనే ఈ సినిమాకు కథ, మాటలు రాశాడు.సినిమా షూటింగ్ మొదలయ్యింది.
ఇందులో శారదను హీరోయిన్ గా తీసుకున్నారు.ముందుగా జయంతిని అనుకున్నా.ఆమె కంటే శారద బాగుంటుందని గోపాల క్రిష్ణ చెప్పడంతో తన మాటకే ఓకే చెప్పాడు.ఎలాంటి ఆటంకం లేకుండడా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.చండశాసనుడు సినిమా విడుదల అయ్యింది.ఈ సినిమాలో శారద నటన మూవీ హిట్ కొట్టడంలో ఎంతో ఉపయోగపడింది.
ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చింది.అటు ఈ సినిమా నిర్మాణ సమయంలోనే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించాడు.ఓవైపు పార్టీ పనులు చూస్తూనే మరోవైపు సినిమా షూటింగ్ లోనూ పాల్గొన్నారు.1983లో ఎన్టీఆర్ పుట్టిన రోజున విడుదలైన ఈ సినిమా అఖండ విజయం సాధించింది.