వైరల్ వీడియో.. డబ్బు కోసం ఇంత డ్రామా అవసరమా?

సోషల్ మీడియాలో రోజూ చాలా వీడియోలు వైరల్( Viral Video ) అవుతుంటాయి.అయితే వీటిలో కొన్నింటి వెనుక వాస్తవాలు, మరికొన్నింటి వెనుక అబద్ధాలు దాగి ఉంటాయి.

 Fake Disabled Beggar Exposed For Five Hundred Rupees Video Viral Details, Viral-TeluguStop.com

ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనిపించే బిచ్చగాళ్ల( Beggars ) గురించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక వ్యక్తి తన తారస పడిన వికలాంగుడిలా( Disable ) నటించే బిచ్చగాడి నిజస్వరూపాన్ని బయటపెట్టిన తీరు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

రోడ్డుపక్కన ఆగిన కారుకు ఒక యువకుడు వచ్చి డబ్బు అడిగాడు.కారులో ఉన్న వ్యక్తి, “నువ్వు కొంచెం నడిచి చూపిస్తే, 500 రూపాయలు ఇస్తాను” అని చెప్పాడు.అప్పటివరకు రెండు ఊతకర్రలుతో కుంటుకుంటూ వచ్చిన ఆ బిచ్చగాడు, ఆ వ్యక్తి సూచించినట్లు ఊతకర్రలు తీసి, సాదారణ మనిషిలా నడిచాడు.వికలాంగుడిలా నటిస్తూ అడుక్కుంటున్న ఆ వ్యక్తి నిజానికి పూర్తిగా ఆరోగ్యవంతుడని ఆ వీడియోతో బయటపడింది.“నిజంగా నీకు సహాయం అవసరమా? ఏ పని చేయడానికి నీకు ఏం కష్టమొచ్చింది?” అని ప్రశ్నించగా.అతను తన పేరు బాదల్( Badal ) అని, తల్లితో కలిసి కాలిబాటపై నివసిస్తున్నానని చెప్పాడు.

కుంటివాడిలా నటిస్తేనే ప్రజలు డబ్బు ఇస్తారని, తన తల్లికి సహాయం చేసేందుకు ఇలా చేస్తున్నానని చెప్పాడు.

అయితే, ఆ వ్యక్తి అతని మాటలను నమ్మలేదు.“కుంభమేళాకు వెళ్లిన నాన్న గురించి అబద్ధాలు చెప్పకూడదు” అని క్లాస్ తీసుకున్నాడు.నిజానికి, ఇటువంటి నటనతో రోజుకు 300 నుండి 400 రూపాయలు సంపాదిస్తున్నానని బాదల్ చెప్పాడు.

అంతకు ముందు 500 రూపాయలు ఇస్తానన్న ఆ వ్యక్తి, చివరికి 20 రూపాయలే ఇచ్చాడు.నిజంగా ఆర్థిక సహాయం అవసరంలో ఉన్నవారికి మాత్రమే సహాయం చేయాలని పేర్కొన్నాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.కొందరు ఆ వ్యక్తిని నిజాయితీ కలిగినవాడిగా ప్రశంసిస్తుంటే, మరికొందరు “డబ్బు కోసం ఏమైనా చేస్తాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube